Medchal Illegal Constructions: మేడ్చల్ మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగం ఉందో, లేదో అన్న అనుమానాలు కల్గుతున్నాయి. పట్టణంలో జరిగే అక్రమ నిర్మాణాల గురించి పట్టించుకోవడం లేదు. చూసిచూడనట్టు వహరిస్తున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తితే నోటీసులు ఇచ్చి, చేతులు దులుపుకుంటున్నారు. రోజు రోజుకు విస్తరిస్తున్న మేడ్చల్(Medcchal) పట్టణంలో భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్నో అనుమతులేని నిర్మాణాలు ఉంటున్నాయి. అధికారులు అమ్యామ్యలు సమర్పించి, తమ పని కానిచ్చేస్తున్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
స్థానికుల ఫిర్యాదులు వెల్లువ
తాజాగా బస్టాండ్ ఎదుట జాతీయ రహదారి పక్కన రోడ్డు(Road)ను ఆక్రమించి మెట్లు నిర్మించిన తీరుపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. కాగా అదే భవనంలో పై అంతస్తులను అనుతుల్లేకుండా నిర్మిస్తున్నారు. రోడ్డు(Road)ను ఆక్రమణ తొలగించిన అధికారులు భవన నిర్మాణానికి మాత్రం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ నోటీసులకు వెరువని భవన యజమాని యథేచ్ఛగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయమై టౌన్ ప్లానింగ్(Town planning) అధికారి రాధాకృష్ణను వివరణ కోరగా నోటీసులు ఇచ్చామని తెలిపారు.
Also Read: Gadwal district Rains: గద్వాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజల ఆవస్థలు