Medaram Jatara: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో తొలి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. వన దేవతల జాతర ప్రారంభానికి సంకేతంగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం గద్దెనెక్కేందుకు ముస్తా బయ్యాడు. తెలంగాణ మహా కుంభమేళ మేడారం మహా జాతర తొలి ఘట్టమైన పగిడిద్దరాజు పోనుగొండ్ల నుండి బయలుదేరు.
Also Read: Medaram Jatara 2026: మేడారం మహా జాతరకు సర్వం సిద్ధం చేసిన ప్రభుత్వం.. ఈసారి ప్రత్యేకతలివే..!
పెనక వంశీయులు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క వస్తున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజును వరుడిగా అలంకరించేందుకు పెనక వంశీయులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. నేడు పగిడిద్దరాజును పెళ్లికు మారుడిగా ముస్తాబు చేయనున్నారు. పూనుగొండ్ల నుంచి బయలుదే రిన పగిడిద్దరాజు సుమారు 70-80 కిలోమీటర్ల అటవీ మార్గాన్ని కాలి నడకన దాటి మేడారం చేరుకోనున్నారు. పగిడిద్దరాజు మేడారం గద్దెపై కొలువుదీరిన వెంటనే మహాజాతరను అధికారికంగా మేడారం జాతరను ప్రకటిస్తారు.
Also Read: Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లలో కలెక్టర్, ఎస్పీ ఫుల్ బిజీ.. ఎక్కడికక్కడ తనిఖీలు

