Mulugu SP: మేడారం మహా జాతరకు వచ్చే సిబ్బందికి తగిన
Mulugu SP ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mulugu SP: మేడారం మహా జాతరకు వచ్చే సిబ్బందికి తగిన వసతులు కల్పించాలి : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్!

Mulugu SP: మేడారం జాతరలో జరిగే పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ, భక్తుల సౌకర్యార్థం చేపట్టే జాగ్రత్త చర్యలు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్ని తానై పర్యవేక్షిస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాతి విగ్రహాలతో ఏళ్ల తరబడి ఉండాలని కాంక్షతో పనులను పునరుద్ధరిస్తుంది. ఈ పనులను అత్యంత జాగ్రత్తతో అధికారుల సమన్వయతో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పర్యవేక్షిస్తున్నారు.

Also Read: Mulugu Police: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలి

మేడారం మహా జాతర–2026 దగ్గర పడుతున్న నేపధ్యంలో మహా జాతర బందోబస్త్ కోసం వచ్చే సిబ్బంది కోసం చేసే వసతి ఏర్పాట్లపై ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ జాతర తేదీలు దగ్గర పడుతున్నందున ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి తగిన వసతులు కల్పిస్తే వారు పూర్తి స్థాయిలో నిబద్ధత గా పని చేసే అవకాశం ఉందని, అందువలన వారి కల్పించే వసతులలో నిర్లక్ష్యం పాటించరాదని అధికారులను ఆదేశించారు.ఈ సమీక్ష సమావేశంలో ములుగు ఓఎస్డీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ఏటూరునాగారం ఏ ఎస్ పి మనన్ బట్ ఐపిఎస్, ములుగు డి.ఎస్.పి రవీందర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read: Mulugu District: స్థానిక ఎన్నికల్లో.. పార్టీ నిలబడిన ప్రతి స్థానంలో మనం గెలవాల్సిందే?

Just In

01

Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!