Mulugu District: కాంగ్రెస్ పార్టీ నిలబడిన ప్రతిస్తానాన్ని కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి గెలిపించుకోవాలని ములుగు(Mulugu) జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్(Ashock) పేర్కొన్నారు. శుక్రవారం గోవిందరావుపేట మండల ముఖ్య నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ.. పార్టీ కంటే వ్యక్తులు ముఖ్యం కాదని, కన్నతల్లి లాంటి పార్టీని స్థానిక సంస్థల్లో గెలిపించుకోవాలని తెలిపారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోయినా కృంగిపోవడం లేదని ఆలోచన వ్యక్తం చేశారు. నా చివరి బొట్టు వరకు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు.
పేదల అభ్యున్నతి లక్ష్యంగా..
రిజర్వేషన్ తనకు అనుకూలంగా లేకపోయినా బాధ ఉన్నప్పటికీ పార్టీ పదవి ముఖ్యం కాదని వెల్లడించారు. కాంగ్రెస్(Congress) పార్టీ పెట్టిన ప్రభుత్వ పథకాలను ఎన్నికల సమయంలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యకర్తలు, నాయకులు స్థానిక సంస్థల విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా నాయకులు కృషి చేయాలన్నారు. పేదల అభ్యున్నతి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వివరించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆహార భద్రత చట్టం తెచ్చి ప్రతి పేదవారికి నెల నెల ఐదు కేజీల బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను ఒక్కో రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు.
Also Read: Local Body Elections: బీసీ రిజర్వేషన్ల టెన్షన్.. డైలమాలో ఆశావాహులు.. గ్రామాల్లో తగ్గిన దావత్‌ల జోష్!
నియోజకవర్గాలకు 3500 ఇళ్లు
రైతు భరోసా కింద ఒక్కో ఎకరానికి 12,000 అందించిన ఘనత కాంగ్రెస్‌దే అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 3500 ఇళ్లను కేటాయించి నిరుపేదల చిరకాల స్వప్నాన్ని సహకారం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. ములుగు జడ్పీ చైర్మన్ పీఠం ఎస్టి(ST) మహిళకు కేటాయించిందని, జడ్పీ చైర్మన్ పదవి కైవసం చేసుకోవాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దాసరి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధి జట్టి సోమయ్య, సీనియర్ నాయకులు కణతల నాగేందర్ రావు, గోవిందరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Bad Boy Karthik: ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’.. అమెరికా నుండి వచ్చిన ఐటమ్ అదిరింది
