Raghunandan Rao: మెదక్ గ్రంధాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్
Raghunandan Rao ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Raghunandan Rao: మెదక్ గ్రంధాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దాలి: మెదక్ ఎంపీ రఘునందన్ రావు

Raghunandan Rao: మెదక్ గ్రంథాలయంలో 58 వ గ్రంథాలయాల వారోత్సవాల్లో ముఖ్యఅతిథిగా మెదక్ ఎంపీ రఘునాథరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ తను 5 లక్షల విలువగల పుస్తకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని, దీనికి ప్రణాళిక చేయాలని గ్రంథాలయ కార్యదర్శికి సూచించారు. మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలో ఆదర్శ గ్రంధాలయంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గ్రంథాలయాల విజ్ఞాన భాండాగారాలని, గ్రంధాలయాలు ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు.

Also Read: Raghunandan Rao: మా పార్టీని డ్యామేజ్ చేసే ప్రతీది రాసి పెట్టుకుంటాం.. రఘునందన్ రావు ఫైర్

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి 

ఈ గ్రంథాలయంలో చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచినందుకు వారికి అభినందనలు తెలుపుతున్న అన్నారు. విద్యార్థులు తమ చదువుల్లో, పోటీ పరీక్షల్లో మాత్రమేకాదు, వ్యక్తిత్వ వికాసంలో కూడా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా గ్రంథాలయాల చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు, నూతన విషయాలు, వివిధ సమాచార వనరులు, ప్రయోగనలపై అవగాహన పెంచడానికి గ్రంథాలయాలు కీలక మాధ్యమంగా నిలుస్తున్నాయన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ గ్రంథాలయాలు నాలెడ్జ్ హబ్‌గా పనిచేస్తాయనీ,అన్ని వయస్సుల వారికి పుస్తకాలు, పత్రికలు, నిఘంటువులు, ఉపయోగపడుతాయన్నారు.

వ్యక్తిగత అభివృద్ధి సుసాధ్యం

పరిశోధనలకు, ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు అవసరమైన వనరులను స్థానికంగా అందిస్తున్నాయన్నారు. డిజిటల్ లైబ్రరీల ద్వారా నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆన్‌లైన్ సమాచారాన్ని సురక్షితంగా పొందగలుగుతారనీ, చదవడం, అభ్యాసం, సమాచారాన్ని పొందడం ద్వారా వ్యక్తిగత అభివృద్ధి సుసాధ్యం అవుతుందనీ పాఠకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ కార్యదర్శి వంశీకృష్ణ, పాఠకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also ReadRaghunandan Rao: మూసీ నదికి అడ్డంగా ఆదిత్య వింటేజ్.. పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు?

Just In

01

Bhatti Vikramarka: బీజేపీలోని ఏ ఒక్క‌నాయ‌కుడైనా దేశం కోసం త్యాగం చేశారా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Sridhar Babu: మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి!

Toy Gun: బొమ్మ తుపాకీతో భారీ స్కెచ్.. నగల షాప్‌లో చివరికి ఏం జరిగిందంటే?

Grok AI Misuse: 3 రోజుల్లో ఆ కంటెంట్‌ను తొలగించండి.. ‘ఎక్స్’కి కేంద్రం సంచలన నోటీసులు

Urea Supply: రైతులు క్షమించరు జాగ్రత్త.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. బీఆర్ఎస్‌పై ఫైర్