Raghunandan Rao: తమ పార్టీని డ్యామేజ్ చేసేలా తప్పుడు వార్తలు రాసే, తప్పుడు సర్వేలను చేసే మీడియా హౌజ్ లను బరాబర్ గుర్తుపెట్టుకుంటామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao) మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవ్వాళ తాము అధికారంలో లేకపోవచ్చని, మీడియా(Media)పై చర్యలు తీసుకునే శక్తి ప్రస్తుతం లేకపోవచ్చని, కానీ భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీది రాసిపెట్టుకుంటామని, లెక్కలుంటాయని మీడియాను రఘునందన్ రావు(MP Raghunandan Rao) హెచ్చరించారు.
గూండాల అనుమతితో నగరం..
మళ్లీ రఘునందన్ బెదిరించారని స్క్రోలింగ్ పెట్టి తనను పెద్ద లీడర్ ను చేయొద్దంటూ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)కుగాను రచించాల్సిన వ్యూహాలపై బీజేపీ కోఆర్డినేషన్ కమిటీ(BJP Coordination Committee) సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఎంఐఎం(MIM) గూండాల అనుమతితో నగరంలో బతకాల్సిన పరిస్థితి రావొద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో కన్నీళ్లతో ఒకరు, కట్టెలతో ఒకరు ప్రచారం చేస్న్రన్నారు. కన్నీళ్లకు కరిగినా, కట్టెలకు భయపడినా భాగ్యనగరం భవిష్యత్ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కన్నీరుకు కారణం వేరని, కట్టెలతో తిరిగే వారి కారణాలు ప్రజలకు తెలుసన్నారు. అందుకే ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదన్నారు.
Also Rread: VC Sajjanar: పండగకు ఊరెళ్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు
సర్వేలు ఎవరు చేశారు?
రూ.11 కోట్లు పెట్టి కట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఈ కట్టెలు పట్టుకుని తిరిగే వారు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ(BJP)పై మీడియా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇతర పార్టీలకు కవరేజ్ ఇచ్చినట్లే.. బీజేపీకి కూడా కవరేజ్ ఇవ్వాలని ఆయన కోరారు. మీడియా మేనేజ్ మెంట్లు తమను విశ్వసించాలని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సర్వేలు వస్తున్నాయని, సర్వేలు ఎవరు చేశారు? ఏసీ(AC) రూంలలో కూర్చుని సర్వేలు చేశారా? అంటూ ఫైరయ్యారు. పార్టీల వద్ద జీతం తీసుకుని పనిచేసేవారు కూడా తమ రిక్వెస్టును అప్పీల్ గా స్వీకరించాలన్నారు. తాము వ్యక్తిగతంగా ఎవరినీ ఇన్ సల్ట్ చేయాలనుకోవడం లేదని రఘునందన్ రావు వివరించారు.
Also Read: Ear Protection: చెవులలో ఉండే గులిమి మంచిదే అంటున్న నిపుణులు
