Raghunandan Rao (image credit: swetcha reporter)
Politics, హైదరాబాద్

Raghunandan Rao: మూసీ నదికి అడ్డంగా ఆదిత్య వింటేజ్.. పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు?

Raghunandan Rao: మూసీ నదికి అడ్డంగా ఆదిత్య వింటేజ్ అనే కన్ స్ట్రక్షన్ సంస్థ పలు నిర్మాణాలు చేపడుతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియాలో ఆయన మాట్లాడారు. నార్సింగిలో ఆదిత్య వింటేజ్ అక్రమ నిర్మాణం చేపడుతోందని, ఇది తాము చెప్పడం లేదని, కొంతమంది నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని వివరించారు. రింగ్ రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డు తీసేసి మరీ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. సర్వీస్ రోడ్డు బంద్ చేసి హెచ్ఎండీఏ అనుమతులు ఎలా ఇచ్చిందని రఘునందన్ రావు ప్రశ్నించారు.

 Also Read: Dimple Hayathi: పెంపుడు కుక్కల వ్యవహారం.. మరో కాంట్రవర్సీలో డింపుల్ హయాతి!

హైడ్రా రంగనాథ్ కు బహిరంగ లేఖ

ఆనాడు నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ అనుమతులిచ్చిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వాటిని కొద్దిరోజులు ఆపేసిందని, కానీ తాజాగా మళ్లీ అనుమతివ్వడంతో కడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య అక్రమ నిర్మాణంపై సీఎం, హైడ్రా రంగనాథ్ కు బహిరంగ లేఖను పంపిస్తున్నట్లు రఘునందన్ తెలిపారు. ఈ నిర్మాణాలకు తిరిగి అనుమతులిచ్చింది ఎవరు? ఎన్ని డబ్బులు చేతులు మారాయనేది చెప్పాలన్నారు.

మంత్రుల ప్రమేయం లేకుండానే ఈ భవంతుల నిర్మాణం చేపడుతున్నారా?

పీసీసీ చీఫ్.., అది చేశాం ఇది చేశామని చెబుతున్నారని, మరి దీనికేం సమాధానం చెబుతారని రఘునందన్ ప్రశ్నించారు. కన్ స్ట్రక్షన్ కంపెనీలు బిల్డింగ్ కట్టి అమ్ముకొని పోతాయని, కానీ చివరకు కష్టాలు పడాల్సింది కొన్నవారేనని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రుల ప్రమేయం లేకుండానే ఈ భవంతుల నిర్మాణం చేపడుతున్నారా? అని ప్రశ్నించారు. దీని వెనకున్న మంత్రులెవరనేది సీఎం బయటపెట్టాలన్నారు. రంగనాథ్ దీనిపై చర్యలెందుకు తీసుకోవడం లేదన్నారు. పేదోడి ఇళ్లను కూల్చేందుకే మూసీ ప్రాజెక్ట్ తెస్తున్నారా? అని ఫైరయ్యారు. పెద్దోళ్ల జోలికి వెళ్ళరా? అని ప్రశ్నించారు. దీనిపై రంగనాథ్ తమకు నోటీస్ ఇచ్చి పిలిస్తే వెళ్తానని రఘునందన్ రావు తెలిపారు.

 Also Read: Crime News: ముగ్గురు దొంగలు అరెస్ట్.. 30 లక్షలకు పైగా విలువ చేసే సొత్తు సీజ్.. ఎక్కడంటే?

Just In

01

Ponguleti Srinivasa Reddy: కాంగ్రెస్ పాల‌న‌లోనే గ్రూప్ -1 నియామ‌కాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

RV Karnan: ఉద్యోగులసేవలు మరువలేనివి.. కర్ణన్ కీలక వ్యాఖ్యలు

OTT Movie: విడిపోయిన ప్రేమ జంట అనూహ్యంగా అలా చేస్తూ పట్టుబడితే.. ఏం చేశారంటే?

CM Revanth Reddy: ఈ నెల 5నాటికి జడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి

Kantara 1 Rebel Song: కాంతార చాప్టర్ 1 నుంచి రెబల్ సాంగ్ వచ్చేసింది.. చూశారా..