Medak District: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి రాచమల్ల సిద్ధేశ్వర్ ,కిరణ్ మూగ బాసే, సుభాష్ యాకరణ్ లు పిలుపు నిచ్చారు.
కార్యకర్తలు ప్రణాళికలు
డీ సీ సీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షత రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ మెదక్(Medak) జిల్లా సమావేశం నిర్వహించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి(Suhasini Reddy) హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో(Local Elections) ప్రతి పంచాయితిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిలు గెలిచేలా నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలు రూపొందించాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం కావాలంటే ముఖ్యంగా గ్రామాలలో రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన్ ద్వారా ప్రజల్లోకి వెళ్తూ, వారి సమస్యల్ని తెలుసుకొని ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చడం ద్వారా పార్టీ బలోపేతం ఆ అవుతుందని తెలిపారు.
Also Read: Minister Konda Surekha: ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా సరే.. చర్యలు తప్పవ్!
ఇది ఒక్క గొప్ప అవకాశం
గ్రామ పంచాయతీ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి మన అందరం కృషి చేయాలని మరియు RGPRSలో పని చేయడం ఇది ఒక్క గొప్ప అవకాశం అని ఆసక్తి ఉన్నవారు మండల కన్వీనర్లుగా, గ్రామ కన్వీనర్లుగా పనిచేయాలని రానున్న రోజుల్లో వారికి పార్టీలో గాని ప్రజల్లోకానీ మంచి పేరు వస్తుందనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చెర్మెన్ సుహాసిని రెడ్డి, టీపీసీసీ నాయకులు సుప్రభాత రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, RGPRS స్టేట్ కో-ఆర్డినేటర్ మహేందర్ రెడ్డి, RGPRS జిల్లా అధ్యక్షులు సుధాకర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ ఉద్దీన్, రమేష్ రెడ్డి, గూడూరి కృష్ణ, గోవింద్ నాయక్, శంకర్, శ్రీనివాస్ చౌదరి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పార్శారం గౌడ్, భారత్ గౌడ్, పవన్, గంగాధర్, లక్ష్మీనారాయణ గౌడ్, అశోక్, సమి, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Gold Rate Today : ఇండిపెండెన్స్ డే స్పెషల్ .. నేడు తగ్గిన గోల్డ్ రేట్స్