Konda Surekha
తెలంగాణ

Minister Konda Surekha: ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంత‌టి వారైనా సరే.. చర్యలు తప్పవ్!

Minister Konda Surekha: ప‌ర్యావ‌ర‌ణ ప‌రీర‌క్షణలో ఫార్మా, డ్ర‌గ్ కంపెనీలు ప్ర‌మాణాలు పాటించాలని ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఆదేశించారు. సెక్ర‌టేరియ‌ట్‌లో బుధవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఫార్మా డ్రగ్స్ కంపెనీ అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో ఉన్న కేసుల వివ‌రాల‌ను మంత్రికి పీసీబీ అధికారులు వివ‌రించారు. సీపీసీబీ(సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు)కి అందిన ఫిర్యాదుల వివ‌రాలను అడిగి తెలుసుకున్నారు. అనుమ‌తులు లేని, అనుమ‌తుల గడువు ముగిసిన కంపెనీల‌ను ఎన్నిసార్లు రైడ్స్ చేశారో.. స్థానికంగా గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతున్న స్టేట‌స్ చెక్ చేస్తున్న తీరుపై మంత్రి ఆరా తీశారు. గ్రౌండ్ వాట‌ర్ క‌లుషితమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ నుంచి డ్రైవ్ చేయించారా? అని ప్రశ్నించారు. ఫార్మా, బ‌ల్క్ డ్ర‌గ్ ప‌రిశ్ర‌మ‌ల అనుమ‌తుల విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయని అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read- Traffic DCP: లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానా విధించటంతో పాటు..?

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంత‌టి వారైనా ఊరుకునేది లేద‌ని హెచ్చరించారు. ప్ర‌భుత్వం తరఫున టాస్క్ ఫోర్స్ క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని వెల్ల‌డించారు. ప్రతీ 6 నెలలకు ఒకసారి కంపెనీలను తనిఖీ చేస్తున్నామని పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి తెలిపారు. కంప్యూటరైజ్డ్ తనిఖీ ప్రక్రియ చేపడుతున్నామని వెల్లడించారు. నివాసాలు ఉన్న చోట ఫార్మా, బ‌ల్క్ డ్ర‌గ్ కంపెనీలను ఇతర ప్రాంతాల్లోకి తరలించేందుకు కసరత్తు చేయాలని మంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఔట‌ర్ రింగు రోడ్డు అవ‌త‌లనే ఫార్మా కంపెనీలుండాల‌ని చెప్పార‌ని, ఆ మేర‌కు చ‌ర్య‌లు తీసుకోవాలన్నారు. నీరు క‌లుషితం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ప్ర‌మాణాలు పాటించని వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అందుకు సంబంధించిన నివేదిక ప్ర‌భుత్వానికి అంద‌జేయాల‌ని ఆదేశించారు. కీలక స‌మావేశానికి కొన్ని కంపెనీ ప్ర‌తినిధులు రాక‌పోవ‌డం ఏంటని ప్ర‌శ్నించారు. సమావేశాలకు కింది స్థాయి ఉద్యోగుల‌ను పంప‌డం స‌రికాదన్నారు. ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అనే చైర్‌కి గౌర‌వం ఇవ్వాల్సిన అనివార్య‌త ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌న్నారు. కంపెనీల‌కు అనుమ‌తుల్లో ఉదాసీన‌త స‌రికాదని పీసీబీ అధికారుల‌ను హెచ్చ‌రించారు. ఎక్క‌డైనా ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Also Read- Tribanadhari Barbarik Trailer: కట్టప్ప, ఉదయభానుల ‘త్రిబాణధారి బార్బరిక్’ ట్రైలర్‌ ఎలా ఉందంటే?

చౌటుప్ప‌ల్ ఏరియా నుంచి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, నీటి క‌లుషితం మీద విప‌రీత‌మైన ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌న్నారు. వాటిపై క‌ఠినంగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణ చ‌ట్టాల మేర‌కు పీసీబీకి, రాష్ట్ర ప్ర‌భుత్వంకు అన్ని అధికారులున్నాయ‌న్న విష‌యం మ‌రిచిపోవ‌ద్దన్నారు. నిబంధ‌న‌లు, ప్రమాణాల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటేనే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ జ‌రుగుతుంద‌న్నారు. క‌రోనా త‌ర్వాత ప‌ర్యావ‌ర‌ణ‌ ప‌రిర‌క్ష‌ణ మ‌రింత కీల‌క‌మైంద‌న్నారు. సిగాచి ఘటన త‌ర్వాత కంపెనీల్లో మ‌రింత భ‌ద్ర‌త అవ‌స‌రమ‌న్నారు. కంపెనీల్లో ఏది ఎలా ఉందో యాజమాన్యాలకు బాగా తెలుసు అని, సెల్ఫ్ ఇన్స్‌పెక్ష‌న్ చేసుకోవాల‌ని సూచించారు. పీసీబీ త‌ర‌ఫున కూడా రైడ్స్ జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. సమావేశంలో అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ అహ్మ‌ద్ న‌దీం, సీఈ ర‌ఘు, శ్రీనివాస‌రెడ్డి, నాగేశ్వ‌ర‌రావు, వెంక‌న్న‌, ర‌విశంక‌ర్, పోచంప‌ల్లి, చౌటుప్ప‌ల్‌, చిట్యాల నుంచి ప‌రిశ్ర‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు