Tribanadhari Barbarik Trailer: స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik). మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ (Satya Raj) ప్రధాన పాత్రను పోషిస్తుండగా.. వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ఇతర ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. టైటిల్‌తోనే ఓ విభిన్నమైన చిత్రమనేలా టాక్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి బుధవారం థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా, సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా? అనే ఫీల్‌ని కలగజేస్తుంది. ఆగస్ట్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ఇటీవల మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ (Tribanadhari Barbarik Trailer)ని గమనిస్తే..
Also Read- Sadaa Emotional: మనసు ముక్కలవుతోంది.. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది.. సదా భావోద్వేగం
పురాణాలకు, ప్రస్తుతం సమాజానికి లింక్ చేస్తూ వచ్చిన ఈ ట్రైలర్.. ‘కార్తికేయ 2’ తరహాలో అందరినీ ఈ సినిమా అలరించబోతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. పురాణాల్లో బార్బరికుడిని పరిచయం చేస్తూ.. ‘చూడు బార్బరికా.. ఈ యుద్ధం నీది.. ధర్మ ధ్వజం రెపరెపలాడాలంటే అధర్మం చేసే వారికి దండన లభించాలి’ అని ట్రైలర్‌ని ఓపెన్ చేశారు. ఆ డైలాగ్‌లోనే సినిమా రేంజ్ ఏంటనేది అర్థమవుతుంది. ‘అనగనగా అందమైన తోట.. ఆ తోటలో తోటమాలి అందంగా పెంచుకుంటున్న ఓ గులాబి మొక్క.. నేను చెప్పిన ఆ కథలో తోటమాలి సామాన్యుడు అనుకుంటే పొరపాటే’.. అంటూ సత్యరాజ్ పాత్రని హైలైట్ చేసిన తీరు, ఇతర పాత్రలను పరిచయం చేసిన విధానం, ట్రైలర్ రన్నింగ్ అన్నీ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేలా ఉన్నాయి. ఇందులో ఒక లవ్ స్టోరీతో పాటు తాత మనవరాలి ట్రాక్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా కొత్తదనం నిండి ఉండటం విశేషం.
Also Read- People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతపై ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఫైర్
‘నేను పాలల్లో నీళ్లే కలుపుతా.. విషం కలుప’ అంటూ ఉదయభాను (Udayabhanu) చెప్పే డైలాగ్, ఆమె ఇందులో పోషించిన పాత్ర.. అన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. మిస్సింగ్ కేసు, మర్డర్ కేసు చుట్టూ ఈ ‘బార్బరిక్’ కథ తిరుగుతున్నట్టుగా ఈ ట్రైలర్ హింట్ ఇస్తోంది. ఇందులో సత్య రాజ్‌ని చూస్తుంటే ఓ యోధుడిలా, మరో వైపు ఓ సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నారు. దర్శకుడు మోహన్ శ్రీవత్స తన మేకింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా.. ఓ పురాణ కథకి, ప్రస్తుతం జరుగుతున్న సామాజిక సమస్యల్ని లింక్ చేస్తూ కథను నడిపించిన తీరుకు ప్రశంసలు పడుతున్నాయి. ఇక విజువల్స్, మ్యూజిక్, ఆర్ఆర్ అన్నీ కూడా టెక్నికల్‌గా ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతుందనేది తెలియజేస్తున్నాయి. ఫైనల్‌గా సినిమాపై భారీగా అంచనాలను పెంచేయడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు