Land Scam: వేంసూరు మండలం ఎర్రగుంట గ్రామంలో ప్రభుత్వానికి చెందిన అసైన్మెంట్ భూములపై భారీ స్థాయిలో అక్రమ కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. వేంసూరు తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కోలా బేబీ మరియు ఆమె కుటుంబ సభ్యులు నకిలీ పత్రాలు సృష్టించి భూములను స్వాధీనం చేసుకున్నారని గ్రామస్థుల ఆరోపణ.ఈ వ్యవహారం బహిర్గతం కావడంతో గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నకిలీ పత్రాలతో భూముల దందా
2014లో కోలా బేబీ వీఆర్ఏగా చేరిన తర్వాత ఈ దందా మొదలైనట్లు సమాచారం. పహానీల్లో ఖాళీగా ఉన్న అసైన్మెంట్ భూములను గుర్తించి, నకిలీ సాదా భైనామా పత్రాలు సృష్టించారు.తెలియని వ్యక్తుల పేర్లతో వారసత్వ భూములుగా చూపించి, కుటుంబ సభ్యుల పేర్లకు బదిలీ చేసుకున్నారు. డిజిటల్ పాస్ పుస్తకాలు జారీ అయిన తర్వాత LRUP రికార్డులు రెవెన్యూ కార్యాలయం నుండి మాయం కావడం అనుమానాలకు కారణమైంది.ఈ వ్యవహారం ఆలస్యంగా RTI ద్వారా మాత్రమే వెలుగులోకి వచ్చింది.
Aslo Read: Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు
కబ్జా చేసిన భూముల వివరాలు:
ఖాతా నం: 739 – కోలా చెన్నారావు (తండ్రి: వేంకటేశ్వరరావు)
▸ సర్వే నం: 256/53/రు/1 → 1-00 ఎకరం
▸ సర్వే నం: 192, 343లో ఆక్రమణ
ఖాతా నం: 183 – కోలా రామయ్య (తండ్రి: వీరయ్య)
▸ సర్వే నం: 256/77 → 2-21 ఎకరాలు
ఖాతా నం: 808 – కోలా వేంకటేశ్వరరావు (తండ్రి: చిట్టెయ్య)
▸ సర్వే నం: 256/21/2 → 3-00 ఎకరాలు
▸ సర్వే నం: 256/64/4/1/1 → 0-27 గజాలు
ఖాతా నం: 809 – కోలా వీరయ్య (తండ్రి: చిట్టెయ్య)
▸ సర్వే నం: 256/64/3/2 → 0-27 గజాలు
ఖాతా నం: 810 – కోలా శాంతమ్మ (భర్త: చిట్టెయ్య)
▸ సర్వే నం: 256/53/రు/2 → 1-00 ఎకరం
ఖాతా నం: 60054 – కోలా బేబీ (భర్త: చెన్నారావు)
▸ సర్వే నం: 256/81/అ/1/2 → 0-11 గజాలు
POT చట్టం 1977 ఉల్లంఘన:
* ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు అసైన్మెంట్ భూములు మంజూరు చేయరాదు.
* ఇలాంటివి మంజూరైనప్పటికీ అవి చెల్లనివిగా పరిగణించబడతాయి.
* సంబంధిత భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి.
* కాబట్టి ఎర్రగుంట ఘటన చట్ట విరుద్ధం మరియు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీసిన ఘటన.
గ్రామస్థుల ఆవేదన – ప్రభుత్వానికి డిమాండ్లు:
అక్రమంగా కబ్జా చేసిన భూములను తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి.
* బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
* భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా రెవెన్యూ శాఖ పర్యవేక్షణ బలోపేతం చేయాలి.
Also Read: Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!