Rajinikanth Coolie
ఎంటర్‌టైన్మెంట్

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth), లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో వచ్చిన ‘కూలీ’ (Coolie Movie) సినిమా నెగిటివ్ టాక్‌తో కూడా రూ. 500 కి పైగా కోట్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ చిత్ర థియేట్రికల్ రన్ పూర్తయినట్లుగానే చెప్పుకోవాలి. ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చిందంటే.. వెంటనే చిత్రం నుంచి వీడియో సాంగ్స్ వస్తాయనే విషయం తెలియంది కాదు. తాజాగా ఈ మూవీ నుంచి ‘చికిటు’ (Chikitu Full Video Song) అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు. ఇప్పుడీ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళుతూ, టాప్ వన్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాట లిరికల్ సాంగ్ విడుదలైనప్పుడు కూడా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే.

Also Read- Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

‘చికిటు’ వీడియో సాంగ్ విడుదల

సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించిన ఈ సినిమా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా హైలెట్స్‌లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ‘చికిటు’ సాంగ్ విషయానికి వస్తే.. ఈ పాటను టి. రాజేందర్, అనిరుధ్, అరివు కలిపి పాడారు. తెలుగులో ఈ పాటకు శ్రీనివాస మౌళి సాహిత్యం అందించారు. రజినీ, ఇతర ఆర్టిస్టుల స్టెప్స్‌తో వచ్చిన ఈ పాట వింటూ ప్రతి ఒక్కరూ స్టెప్ వేస్తారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంత రిథమిక్‌గా అనిరుధ్ ఈ పాటను కంపోజ్ చేశారు.

Also Read- Nag Ashwin: న్యూ జీఎస్టీ రూల్స్.. సినిమా టికెట్ల ధరలపై ప్రధానికి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్

సెప్టెంబర్ 11 నుంచి ఓటీటీలోకి..

తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సంస్థ.. ‘కూలీ’ ప్రీమియర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 11 నుంచి తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషలలో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 240 దేశాలలో ప్రైమ్ వీడియో ఈ సినిమాను ప్రత్యేకంగా స్ట్రీమింగ్‌కు తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారంతా ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

కథ విషయానికి వస్తే..

విశాఖపట్నం రేవుల నేపథ్యములో ఈ ‘కూలీ’ సినిమాను లోకేష్ కనగరాజ్ రూపొందించారు. ఒక మాజీ కూలీ అయిన దేవ.. తన ప్రాణ స్నేహితుడి అనుమానాస్పద మరణంపై దర్యాప్తు చేస్తుండగా.. ఒక స్మగ్లింగ్ సిండికేట్‌కు లింక్ ఉన్నట్లుగా తెలుస్తుంది. రహస్య ఎలెక్ట్రిక్ కుర్చీ, భూస్థాపితం చేయబడిన నిజాలు, వీటికి వెనుక దాగి ఉన్న ఒక ద్రోహిని కనుక్కోవడం కోసం ఆ మాజీ కూలీ ఏం చేశాడు? న్యాయం కోసం పోరాటం చేసే క్రమంలో ప్రస్తుత కథకి, తన గతానికి ఉన్న సంబంధం ఏంటి? ఫైనల్‌గా తన స్నేహితుడి మరణానికి కారణమైన వారిని దేవ కనుక్కున్నాడా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘కూలీ’ సినిమా.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..