Chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

Chiranjeevi Team: టాలీవుడ్‌లోనే కాదు, ఏ వుడ్‌లోనైనా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన కంటే ముందే కొన్ని లీక్స్ వస్తుంటాయి. ఆ హీరో ఆ దర్శకుడితో, ఈ హీరోయిన్ ఆ హీరో సినిమాలో, సినిమా టైటిల్ ఇదే.. ఇలా రకరకాలుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నిజం కావచ్చు, మరికొన్ని ఎవడికో .. ఎక్కి, ఏదో ఒక మూడ్‌లో ట్రెండ్ అవ్వాలని చేసిన పోస్ట్ కావచ్చు. దానినే పట్టుకుని అంతా వేలాడుతూ.. వైరల్ చేస్తారు. అదే నిజమనుకుని వార్తలు మొదలవుతాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా అలాగే వార్తలు వైరల్ అవుతున్నాయి. తనకేం సంబంధం లేకుండానే మోస్ట్ క్రేజీయస్ట్ ప్రాజెక్ట్స్ అయిన రెండు ప్రాజెక్ట్స్‌లో ఆయన స్పెషల్ అప్పీరియెన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందనే విషయం తెలుసుకోకుండా.. అందరూ చర్చలు జరుపుతున్నారు. తాజాగా ఈ వార్తలపై చిరంజీవి (Megastar Chiranjeevi) టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Also Read- Veera Chandrahasa: హోంబలే ఫిల్మ్ ‘వీర చంద్రహాస’ విడుదల ఎప్పుడంటే?

ఆ వార్తలు ఫేక్

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ (Spirit)లో చిరంజీవి ఫాదర్ రోల్ చేస్తున్నట్లుగా ఇటీవల వార్తలు వినిపించాయి. సందీప్ రెడ్డికి చిరుపై ఉన్న అభిమానం దృష్ట్యా అది నిజమేనని అంతా అనుకున్నారు. అలాగే మరో ప్రాజెక్ట్ నాని-ఓదెల ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise)లో చిరంజీవి స్పెషల్ అప్పీరియెన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు మొదలయ్యాయి. ఇది కూడా అంతా నిజమే అనుకున్నారు. ఎందుకంటే, శ్రీకాంత్ ఓదెల కూడా చిరుకు వీరాభిమాని. ఈ రెండు ప్రాజెక్ట్స్‌లో వినిపించిన వార్తల ప్రకారం ఆయన నటించే అవకాశం ఉంది. ఆ రెండు ప్రాజెక్ట్స్ టీమ్ చిరుకి అంత సన్నిహితమైన వారు కాబట్టి అంతా నమ్మేశారు. కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ ఫేక్ వార్తలని చిరు టీమ్ (Chiranjeevi Team) ప్రకటించింది.

Also Read- OG advance bookings: యూకేలో ‘ఓజీ’ హైప్ మామూలుగా లేదుగా.. ఐర్లాండ్‌లో రికార్డ్ బ్రేకింగ్ అడ్వాన్స్ బుకింగ్స్

మేమే చెబుతాం..

ఇలాంటి వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయనే, ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వడానికి ఇటీవల చిరంజీవి తన టీమ్‌తో ఓ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయించారు. అందులో ఇప్పుడు వినిపిస్తున్న ప్రాజెక్ట్స్ గురించి వివరణ ఇచ్చారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి ఒక కొత్త ప్రాజెక్ట్‌లో భాగమవుతారనే ఊహాగానాలు అవాస్తవం. దయచేసి అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ రూమర్స్‌ను పట్టించుకోవద్దని కోరుకుంటున్నాం. చిరంజీవి ప్రాజెక్టులు, ఇతర గెస్ట్ రోల్స్ విషయాల గురించి ఏవైనా అధికారిక ప్రకటనలు ఉంటే, ముందుగా ఈ వేదిక ద్వారా మేమే నేరుగా తెలియజేస్తాం.. టీమ్ మెగాస్టార్’’ అంటూ చిరంజీవి టీమ్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనిపై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, టీమ్ ఉండి కూడా ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు? టీమ్ ఉండి కూడా వేస్టే అనేలా రియాక్ట్ అవుతున్నారు. మొత్తంగా అయితే, చిరు గెస్ట్ రోల్స్ విషయమే క్లారిటీ అయితే వచ్చినట్లయింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం