Veera Chandrahasa: కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’ (Veera Chandrahasa). గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఎమ్‌వీ రాధాకృష్ణ (MV Radhakrishna) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించి మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ‘మహావతార్ నరసింహ’ తర్వాత హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) సమర్పణలో విడుదలకాబోతోన్న చిత్రం ‘వీర చంద్రహాస’. ‘కెజియఫ్, సలార్’ వంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ (Ravi Basrur) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ‘మహావతార్ నరసింహ’ తరహాలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని చిత్రం బృందం భావిస్తోంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.
Also Read- Nag Ashwin: న్యూ జీఎస్టీ రూల్స్.. సినిమా టికెట్ల ధరలపై ప్రధానికి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్
సెప్టెంబర్ 19న విడుదల
కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్ ఎస్ రాజ్‌కుమార్ (NS Rajkumar) నిర్మించిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించగా.. శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, ప్రజ్వల్ కిన్నాల్ వంటి వారంతా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకోగా, తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సెప్టెంబర్ 19న రాబోతోంది. రీసెంట్‌గానే ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు.
‘వీర చంద్రహాస’ కథ ఇదే..
‘వీర చంద్రహాస’ అనేది ‘మహాభారతం’లోని అశ్వమేధిక పర్వంలో జరిగిన కథ. ఇది ఒక అనాథ కుర్రాడి కథగా మొదలై.. ఆ అనాథ కుర్రాడు.. పరాక్రమవంతుడు, సద్గుణవంతుడు వీర చంద్రహాసుడు ఎలా మారాడు? అనే నేపథ్యంలో ఉండనుంది. సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానాన్ని వెండితెరపై పూర్తి వైభవంగా చూపించబోతున్న సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ఎమ్‌వీ రాధాకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేస్తే.. కన్నడ ప్రేక్షకులు బాగా ఆదరించిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్‌కు కూడా తప్పకుండా నచ్చుతుందని దర్శకుడు రవి బస్రూర్ నమ్మకంగా చెబుతున్నారు. చూద్దాం.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి విజయ ఢంకా మోగిస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు