Ponguleti Srinivasa Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Ponguleti Srinivasa Reddy: ఎన్నిక‌ల స‌మయంలో ఇచ్చిన హామీ మేర‌కు రాష్ట్రంలో ఇందిర‌మ్మ రాజ్యం ఏర్పడిన వెంట‌నే గ్రామ సుప‌రిపాల‌న‌పై దృష్టి సారించి గ్రామాధికారుల నియామ‌కానికి శ్రీ‌కారం చుట్టామ‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ హైటెక్స్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Rddy) ముఖ్యఅతిధిగా పాల్గొన్న జీపీవోల నియామ‌క ప‌త్రాల అంద‌జేత కార్య‌క్ర‌మానికి ఆయ‌న అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… గ‌త ప్ర‌భుత్వం 2020 ఆర్వోఆర్ చ‌ట్టం, ధ‌ర‌ణి పోర్ట‌ల్ వల్ల తెలంగాణ స‌మాజం తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌న్నారు. అందువ‌ల్లే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో క‌లిపేసి భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామ‌ని, దీని రూప‌క‌ల్ప‌న స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ని సుమారు 36-37 గంట‌ల‌కు పైగా ప‌లుమార్లు విసిగించి ఆయ‌న స‌ల‌హాల‌తో మ‌రీ అద్బుతంగా తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు.

9.26 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల‌కు మోక్షం

భూభార‌తిని తొలుత 4 మండ‌లాల్లోని 4 గ్రామాల్లో పైల‌ట్ ప్రాజెక్ట్‌గా తీసుకువ‌చ్చామ‌ని త‌ర్వాత 32 మండ‌లాల్లోనూ, జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు అందించామ‌ని వివ‌రించారు. ఎవ‌రి నుంచి ఒక్క రూపాయికూడా తీసుకోకుండా 8.65 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు తీసుకున్నామ‌ని తెలిపారు. గ‌త ప్ర‌భుత్వంలో సాదాబైనామాల‌పై సుమారు 9.26 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల‌కు మోక్షం క‌ల‌గ‌లేద‌ని,పైగా కోర్టుల‌లో కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. తాజాగా నిర్వ‌హించిన స‌ద‌స్సుల‌లో సుమారు 8.65 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని తెలిపారు. ఈ నేప‌ధ్యంలో ఇందిర‌మ్మ ప్ర‌భుత్వం త‌ర‌పున మ‌రింత గ‌ట్టిగా కృషి చేసి వారం రోజుల క్రితం కోర్టులో సాదాబైనామాల‌పై స్టేను తొలగించేలా ప్ర‌య‌త్నించి స‌ఫ‌ల మ‌య్యామ‌ని తెలిపారు. గతంలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు, ప్ర‌స్తుత తాజా ద‌ర‌ఖాస్తుల‌న్నింటినీ సాధ్య‌మైనంత త్వ‌రగా ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 6860 క్ల‌స్ట‌ర్‌ల‌ను ఏర్పాటు చేసి 10,954 రెవెన్యూ గ్రామాల‌లో గ్రామ‌ప‌రిపాల‌నాధికారుల నియామ‌కం చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు.

Also Read: Nestle CEO Fired: నెస్లే కంపెనీ సీఈవోపై తొలగింపు వేటు.. చేసింది అలాంటి పని మరి

భూ సేక‌ర‌ణలో రైతుల పేర్లు

ఇక స‌ర్వేయ‌ర్ల నియామ‌కం ద్వారా భూ స‌మస్య‌ల‌కు చెక్ పెడ‌తామ‌న్నారు. 318 మంది స‌ర్వేయ‌ర్లుకు అద‌నంగా 800 మందిని నియమించ‌డ‌మేగాక 7000 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌ను వ‌చ్చే ఉగాదిలోగా భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.అంతేగాక సుమారు 3 ద‌శాబ్దాలుగా వివిధ ప్రాజెక్ట్ ల‌కు జ‌రిగిన భూ సేక‌ర‌ణలో ఇంకా రైతుల పేర్లు పానీలో ఉండిపోయాయ‌ని ఈ స‌మ‌స్యను కూడా ప‌రిష్క‌రిస్తామ‌న్నారు.ప్రతి సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ 31వ తేదీనాటికి అన్ని గ్రామాల వారీగా జ‌మాబందీ మేర‌కు అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన క్ర‌యవిక్ర‌యాల‌ను హ‌క్కుల‌ను వివ‌రించేలా ప్ర‌క‌ట‌న జారీ చేస్తామ‌న్నారు. దీని హార్డ్‌కాపీలు ప్ర‌తి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఇక‌పై ప్ర‌భుత్వానికి మాట‌, మ‌చ్చ రాకుండా ప‌నిచేయాల్సిన బాధ్య‌త రెవెన్యూ కుటుంబ స‌భ్యుల‌దేన‌ని చెబుతూ ఉన్న‌త సేవ‌లు అందిస్తామంటూ మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌తిజ్ఞ చేయించారు.

Also Read: NHPC 2025 : నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు..

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు