Damodar Raja Narasimha ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Damodar Raja Narasimha: మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై.. మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్!

Damodar Raja Narasimha: మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన బ్రతికే ఉన్న వ్యక్తిపై వివిధ వార్తాపత్రికల ద్వారా వెలుగులోకి వచ్చిన విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయమై ఎంక్వయిరీ నిమిత్తం ముగ్గురు వైద్యుల బృందంతో విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణకు వచ్చిన అధికారుల పైన కూడా రోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్చురీలో బ్రతికున్న అభాగ్యుడిని పెట్టి తాళం వేసిన ఘటనపై తీవ్ర కళకళమే రేగింది. గత నాలుగు రోజుల క్రితం నుంచి ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న అభాగ్యుడుకి వైద్యం అందించకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించారు.

మృతదేహానికి పంచనామ చేయాలి

ఆస్పత్రి ఆవరణలో క్యాంటీన్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఎల్డి రాజును ఆ క్యాంటీన్ కు సంబంధించిన వారు స్ట్రక్చర్ పై మార్చురీకి తరలించి అక్కడే భద్రపరిచారు. అప్పుడు అభాగ్యుడు రాజు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. ఆ మరుసటి రోజు గుర్తుతెలియని మృతదేహానికి పంచనామ చేయాలని ఆస్పత్రి నుంచి మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. దీంతో టౌన్ సిఐ మహేందర్ రెడ్డి ఆదేశాలతో ఎస్సై సూరయ్య శభాపంచనామ నిమిత్తం ఆసుపత్రిలోని మార్చురీ వద్దకు వివరాలు సేకరించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే రాజుపై కప్పి ఉంచిన చద్దర్ ను తీసే క్రమంలో రాజు కదులుతూ ఎస్ఐ సూరయ్యకు కనిపించాడు.

 Also Read: Mahabubabad SP: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కీలక సూచనలు

ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలా కృషి

దీంతో స్పందించిన ఎస్ఐ సూరయ్య హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలా కృషి చేశారు. ఆ నోట ఈ నోట ఈ విషయం అంత బయటకు పొక్కింది. ఏం చేయాలో వైద్యులకు సిబ్బందికి పాలుపోలేదు. దీంతో మార్చురీలో రాజును ఉంచామన్నది తప్పని, అతనే వర్షం వస్తున్న క్రమంలో అక్కడికి వెళ్లి పడుకున్నాడని సూపర్డెంట్ శ్రీనివాస్ మీడియాకు వివరించారు. రాజు నడిచే పరిస్థితి ఉంటే క్యాంటీన్ వద్ద నుంచి ఇద్దరు వ్యక్తులు స్ట్రక్చర్ పై ఎందుకు తీసుకెళ్లారో అది కూడా మార్చురీ వద్దకు తీసుకెళ్లి ఎందుకు ఉంచారో కూడా తెలియని దుస్థితిలో సూపర్డెంట్ శ్రీనివాస్ ఉన్నారంటే ఆయనకు విధుల పట్ల ఎంతటి అవగాహన ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పైగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి డి పి ఆర్ ఓ రాజేంద్రప్రసాద్ తో రిజైన్డర్ (తిరిగి మార్చురీ ఘటనపై) ప్రకటనను సైతం ఇప్పించడంలో ఆంతర్యం ఏంటని ఆసుపత్రిలోని రోగులు ప్రశ్నిస్తున్నారు.

పట్టించుకోవలసిన అవసరం లేదా?

అంటే ఎస్సై సూరయ్య మార్చురీ వద్దకు వచ్చి రాజును పరిశీలించేంతవరకు అటువైపుగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వెళ్లి పరిశీలించకపోవడం గమనార్హం. అంటే ఎవరు నిర్ధారిస్తే మృతి చెందినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎవరు చెబితే పోస్టుమార్టం నిర్వహించాలని సమాచారాన్ని పోలీసులకు అందించారు అనే విషయాలపై సవాలక్ష అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభాగ్యుడు అయితే పట్టించుకోవలసిన అవసరం లేదా? క్యాంటీన్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న రాజును స్ట్రక్చర్ పై తీసుకువెళ్లి మార్చురీలో ఉంచే బదులు… మానవత్వం ఉంటే ఏఎంసీ వార్డులో చేర్చి ఎందుకు చికిత్స అందించలేకపోయారో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం. చనిపోయాడని మార్చురుకి తరలించడం కరెక్టేనా..? లేదంటే బ్రతికించాలని మానవత్వ ఆలోచన ఎందుకు లేకుండా పోయింది. అంటే ఆసుపత్రిలో పనిచేసే వారందరికీ జీతాలు కావాలి కానీ, అపస్మారక స్థితిలో ఉన్న అభాగ్యుడి ఆరోగ్య బాగోగులు ఎవరికి పట్టలేదు.

మార్చురీ ఘటన పై విచారణ పారదర్శకమేనా?

మార్చురీలో బ్రతికున్న రాజును రాత్రంతా ఉంచి తెల్లవారుజామున శవ పంచనామ కోసం పోలీసులకు సమాచారం అందించారు. కానీ, మరి ఆ అభాగ్యుడు బ్రతికున్నాడా మృతి చెందాడ.. మృతి చెందితే ఎవరు నిర్ధారించాలి అలాంటి పనులను వైద్యులు, సూపర్డెంట్, ఆర్ ఎం ఓ లు ఎందుకు దృష్టి సారించలేకపోయారు. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటే ఒక ఆసుపత్రి సూపరింటెండెంట్ అభాధ్యత విధుల నిర్లక్ష్యం పై అదే స్థాయి సూపరిండెంట్ లను విచారణకు పంపించడంలో పారదర్శకంగా విచారణ సాగుతుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు, స్థానిక ఎమ్మెల్యేను పక్కదారి పట్టించిన సూపరింటెండెంట్, ఆర్ ఎం ఓ ఆస్పత్రిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డ్ మొదలుకొని, స్వీపర్స్, వైద్య సిబ్బంది, వైద్యులు, క్యాంటీన్ కు సంబంధించిన వారు కూడా నిర్లక్ష్యంలో భాగస్వాములయ్యారు.

వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ

అపస్మారక స్థితిలో ఉంటే పరీక్షించాల్సిన వైద్యులే పట్టించుకోకుండా మృతి చెందినట్లు నిర్ధారించి శవ పంచనామా కోసం పోలీసులకు సమాచారం అందించారంటే వైద్యుల సేవలు ఏమాత్రం అందుతున్నాయో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేస్తే సాదాసీదాగా ములుగు సూపర్టెండెంట్ చంద్రశేఖర్, జనగామ సూపర్టెండెంట్ గోపాల్ రావు, సిద్దిపేట మెడికల్ కాలేజీ ఫోరెన్సిక్ నిపుణులు శ్రీధర్ లతో కూడిన వైద్య బృందం సైతం విచారణ పారదర్శకంగా నిర్వహిస్తారా… అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న జీతాలను ఎంజాయ్ చేస్తూ ఎవరికోసమైతే నియమింపబడ్డారో వారినే నిర్లక్ష్యం చేయడం వైద్యులకు తగునా అంటూ రోగులు పెదవి విరుస్తున్నారు.

ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం

వివిధ శాఖల్లో రెండు సంవత్సరాలు మహా ఎక్కువైతే మూడు సంవత్సరాలు మాత్రమే ఆ శాఖలు విధులు నిర్వహిస్తుంటారు. కానీ, మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న అటువైపు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. వైద్య శాఖలో లాంగ్ స్టాండింగ్ కింద ఉన్న వైద్యులందరినీ ఇతర ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రులకు బదిలీ చేయాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని కృషి చేస్తుంటే ఆసుపత్రుల్లో పనిచేసే రైతులు మాత్రం రోగులను నిర్లక్ష్యం చేస్తూ వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.

 Also Read: Mahabubabad Shocking: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బతికుండగానే మార్చురీకి పేషెంట్.. రాత్రంతా శవాల మధ్యనే

Just In

01

Vishnu Priya: ఇప్పటికి మూడు సార్లు జరిగింది.. కిసిక్ టాక్స్‌లో ఆ నిజాలు బయట పెట్టిన విష్ణుప్రియ..

MLAs Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుని గడువు కోరిన స్పీకర్

Congress Politics: రాజగోపాల్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు?.. కాంగ్రెస్‌లో ఇంటర్నల్ పాలిటిక్స్ మళ్లీ మొదలు?

Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

JubileeHills Bypoll: బిల్లా రంగాలు ఇటొస్తే స్తంభానికి కట్టేయిర్రి.. కేటీఆర్‌పై సీఎం రేవంత్ పంచ్‌ల మీద పంచులు