Mahabubabad SP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల సహకారంతోనే సమాజానికి పూర్తి భద్రత లభిస్తుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ సూచించారు. భారతదేశ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణ, సరిహద్దు జిల్లాలో మావోయిస్టుల అలజడుల నేపథ్యంలో నిఘ మరింత గా బలపరిచేందుకు జిల్లావ్యాప్తంగా అన్ని పోలిస్టేషన్లో పరిధిలో భద్రతా చర్యలను పోలీసులు చేపట్టారని తెలిపారు.
ప్రధాన రహదారులు, గ్రామీణ మార్గాలు ప్రత్యేక వాహనాలు (vehicle checkings) నిర్వహించామన్నారు. సాయంత్రం, రాత్రి వేళల్లో సడన్ చెకింగ్స్ (surprise checking) నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను విచారణ చేశామన్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ లతో పాటు ప్రత్యేక బలగాలతో నిఘా చర్యలను ముమ్మరం చేశామని తెలిపారు.
Also Read: Uttam Kumar Reddy: యుద్ధానికి నేను రెడీ.. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పాల్సిందే!
ప్రైవేట్, ప్రభుత్వ రంగ పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలి
ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో జిల్లాలోని పరిశ్రమలు కంపెనీలు కాపాడేందుకు భద్రత అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రతా చర్యాల నేపథ్యంలో ఎస్పి రోహిత్ రాజ్ భద్రత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అశ్వాపురం భారజల ఉత్పత్తి కేంద్రం, సారపాక ఐటిసి, కేటీపీఎస్, బి టి పి ఎస్, ఎన్ఏవీఏ లిమిటెడ్ కంపెనీల అధికారులు, భద్రతా సిబ్బంది తగు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న నిబంధనలను పాటిస్తూ పటిష్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలారం సిస్టం విధానాన్ని తమ కంపెనీల ఉద్యోగులకు, వారి కుటుంబాలకు, చుట్టుపక్కల ప్రాంతాలవారికి అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేయాలని తెలిపారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు, అనుమానం కలిగించే వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాల పట్ల కూడా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. అత్యవసర సమయంలో ప్రజలు పాటించాల్సిన విషయాలపై అవగాహన కల్పించారు. ఇలాంటి పవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిశ్రమలు, కంపెనీల వద్ద గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు