Operation Sindoor: ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలని రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని మంత్రి కొండా సురేఖ దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి అత్యవసర సమయంలో భారత ఆర్మీకి మనమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” రెండో దాడి విజయవంతం కావడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఆర్మీ బలగాలు సరిహద్దులో పోరాడుతున్న సమయంలో వారి క్షేమం కోరి మనమంతా పూజలు చేయడం సందర్భాచితం అన్నారు.
Also Read: Indiramma Houses: జర్నలిస్టుల సంక్షేమం కోసం.. కొత్త ఆర్థిక సహాయం!
తీవ్రవాదాన్ని యావత్ భారతమంతా ఉక్కు పిడికిలితో ఎదుర్కొన్నదన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణ మంత్రిగా కాదు.. దేశ పౌరురాలిగా, ఆపరేషన్ సిందూర్ పై హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. దేశ భద్రత విషయంలో అందరినీ కలుపుకోవాలనికేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దేశ భద్రతపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయం చేయదన్నారు. మేము భారత ఆర్మీకి పూర్తి మద్దతుగా ఉన్నామన్నారు. రానున్న రోజుల్లో కూడా ఉంటామని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు