Mahabubabad: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో మార్చురి ఘటనపై ఎమ్మెల్యే డా భూక్యా మురళి నాయక్ గత రెండు రోజుల నుండి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జనరల్ హాస్పిటల్ లో వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే మురళి నాయక్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ సూపర్నెంట్ సమయపాలన పాటించడం లేదని వైద్య సిబ్బంది కూడా సమయపాలన కొరవడిందని హెచ్చరించారు. హాస్పిటల్ లో నర్సులు సాహితం కాలక్షేపణ చేస్తూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పని చేయిస్తున్నారని కొంత మంది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకు వచ్చారని ఎమ్మెల్యే గారు చాలా సీరియస్ గా స్పందించారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడం చాలా బాధకరం
ఈ రోజు నుండి ఒక్క ఉద్యోగి కూడా డ్యూటీ లో ఉన్నపుడు సెల్ ఫోన్ ఉపయోగించరదని అన్నారు.అత్యవసరం అయితే ఆన్రైడ్ ఫోన్లకు బదులు నార్మల్ ఫోన్స్ ఉపయోగించాలని అన్నారు.రేవంత సర్కార్ ఏర్పడ్డ తర్వాత వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మెరుగైన సేవలు అందిస్తుంటే మరో వైపు ఇలా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడం చాలా బాధకరం అని అన్నారు. కొన్ని రోజులలో జిల్లా ఆసుపత్రి లో మార్పు రావాలని ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఎమ్మెల్యే మురళి నాయక్ హెచ్చరించారు. బతికున్న మనిషిని మార్చురీకి తరలించిన ఘటనలో విధుల్లో నిర్లక్షం వహించిన ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలకు ఆదేశించారు..ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే హాస్పిటల్ సూపర్డెంట్, ఆర్ ఎం ఓ, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ పై చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.
బాలికల సదనం నుండి ఇద్దరు బాలికలు అదృశ్యం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలోని శివలింగాపురం బాలల సదనం నుండి ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా… భద్రాచలాకి చెందిన ఇద్దరు బాలికలు బాల్యవివాహాలు చేసుకోవడంతో వారిని మణుగూరు శివలింగాపురం బాలల సదనంలో చేర్చారు. అయితే వారిద్దరూ శనివారం ఉదయం కాల కృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తున్నామని చెప్పి బాలికల సదనం గోడ దూకి వెళ్లిపోయారు. వారు ఎక్కడ ఉన్నారనే సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Mahabubabad:స్నేహితుడి కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం.. మేమంతా ఉన్నాం!
భద్రాచలం పట్టణంలోని దారుణం.. ముగ్గురు మహిళలపై కత్తితో దాడి
భద్రాచలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలపై బ్లేడుతో దాడి చేసి ఓ వ్యక్తి పరారయ్యాడు. భద్రాచలం పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీ మూడో లైన్ లో నివాసం ఉంటున్న జాస్మిన్ ఆమె తల్లి హమీదా పిన్ని ఫాతిమా అనే మహిళల పై ఆమె అల్లుడు కత్తితో దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే
హమీదా అల్లుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య జాస్మిన్ తో గొడవ పడుతూ అడ్డువచ్చిన అత్త హమీదా, చిన్న అత్త ఫాతిమా ల పై దాడి చేసి, అక్కడే ఉన్న అతని భార్య గొంతు కోసి పరారయ్యాడు.
దాడిలో హమీద, ఆమె కూతురు జాస్మిన్ లకు తీవ్ర గాయాలు కాగా, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి స్థానికులు తీసుకు వెళ్లి వైద్యం అందిస్తున్నట్లు బంధువులు తెలిపారు.
మద్యం మత్తులో బ్లేడ్ తో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు.
