Mahabubabad District: అధికారుల అండదండలతో అక్రమ వెంచర్లు వేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. దీనిపై పత్రికలో కథనాలు రాగా రెండు రాళ్లు తీసి మిగిల్చారు. మహబూబాబాద్(Mehabubabad) జిల్లా, తొర్రూరు పట్టణంలోని అన్నారం వెళ్లే ప్రధాన రహదారి పక్కనే 117 సర్వేనెంబర్లో 18 ఎకరాల నాన్ లేఔట్ వెంచర్ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ భారీ స్థాయిలో వెంచర్ పనులు చేపడుతున్నారు. అనుమతులు లేని వెంచర్ లో పనులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఈ అక్రమ వెంచర్ పై పలుమార్లు కథనాలు రాసిన అధికారులు మాత్రం నోటీసులు జారీ చేశాం, హద్దు రాళ్లు తీసేస్తామని మాటలు చెపుతు దాటవేస్తున్నారు. పట్టణంలో సొంతిల్లు కట్టుకోవాలని కళతో స్థలాలు కొనుక్కోవడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని రియాల్డర్లు అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో పడి చర్యలు మరిచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read: Sonia Gandhi: ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు
రాళ్లు తీస్తామన్నరు – రెండు తీసి మిగిల్చారు
గత కొన్ని రోజులుగా పలు సార్లు పత్రికలో ఈ అక్రమాలపై కథనాలు వచ్చినా, తగిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్వీర్యంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. దీంతో స్థానికుల ఆరోపణలు అధికారులకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలుచోట్ల స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ వెంచర్లో హద్దు రాళ్లు తీసేస్తామని చెప్పిన అధికారులు ఒకటి రెండు రాళ్లు తీసి ప్రజలను నమ్మిస్తూ మోసగిస్తున్నారు. వెంచర్ నిర్వాహకులకు అధికారులు కొమ్ముకాస్తున్నారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టౌన్ ప్లానింగ్ అధికారి జడేక్కడ?
నగర అభివృద్ధికి కళ్లుగప్పేలా ఉండాల్సిన టౌన్ ప్లానింగ్(Toun Planing) అధికారీ చూసి చూడనట్టు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెంచర్ బంద్ చేయాల్సిన అధికారులే రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొర్రూరు పట్టణంలో రోజు రోజుకీ అక్రమ నిర్మాణాలకు ఆద్దు అదుపు లేకుండా పోయినప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తూ అక్రమ వెంచర్లలో ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇస్తు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రభుత్వ స్థలంలో నుంచే వెంచర్ కు దారి
చట్టబద్ధంగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు పుట్టుకొస్తుండగా, అక్కడ ప్రభుత్వ స్థలాన్ని దారిగా మార్చుకోవడం అధికారుల మౌనసమ్మతంతోనే జరిగిందనీ స్థానికుల ఆరోపిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆదాయానికి గండికాదా? అయిన కూడా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? అధికారులకు ముడుపులు మట్టయా? లేదా పట్టించుకోవడం లేదా?
రాజకీయ నాయకుల ఒత్తిడి ఏం ఆయిన ఉందా? అనే విమర్శలు తలెత్తున్నాయి. తొర్రూరు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రతిరోజూ పెరుగుతున్న అక్రమ వెంచర్ల సంఖ్యకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, లేకపోతే ప్రజల నమ్మకమే దెబ్బతింటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Also Read: MP Kishan Reddy: జాయినింగ్స్ పై కమలం ఫోకస్.. చేరికలు చేపట్టాలని పిలుపు