MP Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం, ఈ కార్ రేసు విచారణ, బనకచర్ల ప్రాజెక్టు అంటూ కేసులు, విచారణలతో తెలంగాణ పాలిటిక్స్(Telangana Politics) హాట్ హాట్ గా సాగుతుండగా మరో వైపు బీజేపీ(BJP) బాంబు పేల్చింది. తమకు టచ్ లో కొందరు నేతలు ఉన్నారంటూ తెలంగాణ పాలిటిక్స్ లో కొత్త చర్చకు కారణమైంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానితో సంప్రదింపులు జరుపుతున్నారంటూ స్వయంగా కేంద్ర మంత్రి, కాషాయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని పార్టీలు కేసులు, విచారణలంటూ తలమునకలైన తరుణంలో కమలదళం సైలెంట్ గా ఆపరేషన్ ఆకర్ష్(Operation Akarsh) కు తెరదీసినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ స్థాయి నేతలను పార్టీలోకి లాగుతారా? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ జాబితాలో ప్రజాప్రతినిధులు ఉంటారా? లేదంటే ద్వితీయ శ్రేణి నాయకులుంటారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్‌ను మార్చడం
త్వరలో తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలు(Local Body Elections) రాబోతున్న తరుణంలో అటు ఆపరేషన్ ఆకర్ష్ తో పాటు జిల్లా స్థాయిలోనూ నేతలను చేర్చుకోవడంపై కాషాయ పార్టీ దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు ఇప్పటికే ఎంతో మంది నేతలు టచ్ లోకి వచ్చారని కిషన్ రెడ్డి హింట్స్ ఇవ్వడంతో శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది. ఇదే నిజమైతే కమల దళానికి మంచిరోజులు వచ్చినట్లేనని చెవులు కొరుక్కుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్(BRS) పై వ్యతిరేకతతో ఎంతోమంది కాషాయ పార్టీలోకి వలస వచ్చారు. కానీ తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ ను మార్చడంతో ఎన్నికలకు కొద్ది రోజుల ముందే వచ్చిన చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు.
అలా జంప్ అయిన వారిలో వివేక్(Vivek) ఇటీవల మంత్రి పదవిని సైతం పొందారు. ఏపీ జితేందర్ రెడ్డి(Jitender Reddy) ఢిల్లీలో తెలంగాణ స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఉంటూనే స్పోర్ట్స్ అఫైర్స్ కు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు. మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటీ చేసి ఓటమి చవిచూసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komati Reddy Rajagopal Reddy) తిరిగి సొంత గూటి(కాంగ్రెస్ లోకి)కి వెళ్లి తిరిగి ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి తరుణంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీజేపీలోకి టచ్ లో ఉన్న నేతలెవరనే ప్రశ్న అందరి మెదళ్లను తొలచివేస్తోంది.
Also Read: Child Protection Wing: సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్!
పొలిటికల్స్ సర్కిల్స్‌లో చర్చ
తెలంగాణ ప్రజలు క్రాస్ రోడ్ లో ఉన్నారని, ఒకవైపు పూర్తిగా వైఫల్యం చెందిన కాంగ్రెస్(Congress), మరోవైపు ప్రతిపక్షంగా విఫలమైన బీఆర్ఎస్(BRS) ఉన్నాయని, అందుకే ప్రజలు బీజేపీ(BJP) వైపు చూస్తున్నారని రాష్ట్ర నాయకత్వం పేర్కొంది. తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ వైపు ఎవరూ మొగ్గుచూపే అవకాశం లేదని పొలిటికల్స్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఇక ప్రభుత్వంపై సైతం ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
దీంతో అందివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని కాషాయ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వ్యూహత్మకంగానే కిషన్ రెడ్డి(KIshan Reddy) కొంతమంది టచ్ లో ఉన్నారనే విషయాన్ని బయటపెట్టారని చర్చించుకుంటున్నారు. ఎలాగూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో మౌత్ పబ్లిసిటీ జరిగితే ఒకరిని చూసి ఇంకొందరు నేతలు వచ్చే అవకాశముందన్న నేపథ్యంలో ఈ కామెంట్స్ చేసి ఉంటారని పొలిటికల్ సర్కిల్స్ లో వినికిడి.
Also Read: Car Parking KBR: మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ.. ఈ సమస్యకు చెక్!
నెలాఖరు వరకు ఎన్నికల ఇన్ చార్జీల నియామకం
లోకల్ బాడీ ఎన్నిక(Local Body Elections)లో రివర్స్ ద ట్రెండ్ అనే సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని వ్యూహరచన చేసుకుంది. దీనికి రూట్ మ్యాప్ ప్రిపేర్(Rute Map) చేయడంపై దృష్టిసారించనుంది. రాష్ట్రస్థాయి లీడర్లతో పాటు జిల్లా స్థాయి లీడర్లను సైతం చేర్చుకుని బలోపేతం కావాలని బీజేపీ(BJP) నిర్ణయించుకుంది. తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం వచ్చాక జిల్లా కమిటీలు కూడా పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకు ఎన్నికల ఇన్ చార్జీల నియామకం సైతం చేపట్టాలని చూస్తోంది.
పార్లమెంట్, జిల్లా, మండలస్థాయిలో కమిటీలు పూర్తిచేసి జూలై మొదటి వారంలో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ ఆ తర్వాత జిల్లా, మండల స్థాయిలో నిర్వహించేలా ప్రణాళికలు రచించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు బీఆర్ఎస్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రధానంగా యువత(Youth)ను పార్టీలోకి చేర్చుకుని పోరాటాలు చేపట్టాలని చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీ చైర్మన్ వరకు గెలవాలని భావిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజెపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే స్పష్టంచేసింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రెడీగా ఉండాలని దిశానిర్దేశం చేసింది. కమలం వ్యూహం సక్సెస్ అవ్వాలంటే ఆ పార్టీకి టచ్ లో ఉన్న ఆ నేతలెవరనేది తెలియాల్సి ఉంది.
Also Read: Iran Israel Conflict: ఇరాన్‌కు భారత్ ప్రత్యేక విజ్ఞప్తి.. వెంటనే అంగీకారం