Car Parking KBR (imagecredit:twitter)
తెలంగాణ

Car Parking KBR: మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ.. ఈ సమస్యకు చెక్!

Car Parking KBR: అరుదైన సందర్భాల్లో షి ‘కారు’ చేస్తూ నగరంలోని రద్దీ ప్రాంతాలకు వస్తున్న మధ్య తరగతి కుటుంబానికి కారు ఎక్కడ పార్కు(Car Parking) చేయాలన్నదే పెద్ద టెన్షన్‌గా మారింది. పెరుగుతున్న ట్రాపిక్‌కు అనుగుణంగా ఎప్పటికపుడు రోడ్లను విస్తరించుకుంటున్నా, రోజురోజుకి పెరుగుతున్న వాహానాల సంఖ్య రద్దీకి అనుగుణంగా పార్కింగ్ వసతి అందుబాటులో లేకపోవటంతో నగరంలో చాలా రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య తలభారమైంది. ఈ సమస్యతో చాలా వ్యాపార సంస్థలు వెలెట్ పార్కింగ్‌లను ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నాయి. ఈ క్రమంలో ఉదయం సాయంత్రం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఉన్నతాధికారులు వందల సంఖ్యలో రాకపోకలు సాగించే అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్కు మెయిన్ రోడ్డులో పార్కింగ్ సమస్యకు చెక్ పెడుతూ నవ నిర్మాణ్ సంస్థ ఆధునిక రోలర్ సిస్టమ్‌తో సరి కొత్త మెకనైజ్డ్ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ

కేబీఆర్ పార్కులోని సుమారు 400 చదరపు గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీ నవ‌నిర్మాణ్ సంస్దకు కేటాయించిన కేవలం నాలుగైదు నెలల వ్యవధిలోపే ఆ సంస్థ ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవటం పట్ల పరిసర(Multi Level Parking) ప్రాంతాలకు చెందిన కారు యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్కు(KBR Park) లోకి, పరిసర ప్రాంతాల్లోని కేఫేలకు రాకపోకలు సాగించే సందర్శకులు, వాకర్లకు ఎలాంటి పార్కింగ్ టెన్షన్ లేకుండా ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ లో తమ కారును పార్కు చేసుకుని వెళ్లే వెసులుబాటు కల్గింది. గతంలో ఇక్కడ రోడ్డు పక్కన కారు, టూ వీలర్ వంటివి పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు(Traffic Police) ఛలానాల బాదేవారు. ఇపుడు ఛాలానా నుంచి కాస్త రిలీవ్ కల్గిందని కారు యజమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1 వద్ద 400 గజాల్లో 15 మీటర్ల ఎత్తులో కేవలం రూ.6 కోట్ల వ్యయంతో ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థలో ఆరు ట్రాక్ లను ఏర్పాటు చేయగా, వీటిలో రెండు ట్రాక్ లను ఎస్ యూవీ కార్లకు కేటాయించారు.

Also Read: CM Revanth Reddy: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌ 2 మంజూరు చేయండి!

పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్

ఒక్కో ట్రాక్‌లో పన్నెండు కార్లుచొప్పున పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ మొత్తం కెపాసిటీ 72 కార్ల వరకు పార్కింగ్ చేసుకోవచ్చునని నిర్వాహకులు తెలిపారు. సెన్సార్లు, లిఫ్టులు, ఆటోమేటెడ్ సిస్టమ్ సహాయంతో మల్టీలెవల్ పార్కింగ్ పని చేస్తుంది. దీన్ని పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (PPP) పద్దతిని ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసిన నవ నిర్మాణ్(Nava Nirman partnership) సంస్థ ఈ కాంప్లెక్స్ పై డిజిటల్ స్క్రీన్ అడ్వర్టైజ్ మెంట్ వేసుకునేందుకు జీహెచ్ఎంసీ అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు వద్ద ఈ మల్టీలెవెల్ పార్కింగ్ వ్యవస్థ సక్సెస్‌గా ట్రయల్ రన్ పూర్తి కావటంతో, ఇదే తరహాలో పార్కు చుట్టూ మరో రెండు ఇలాంటి పార్కింగ్ లను, నగరంలో మరిన్ని రద్దీ ప్రాంతాల్లో ఈ తరహాలోనే పార్కింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని జీహెచ్ఎంసీ(GHMC) భావిస్తున్నట్లు సమాచారం.

ఎంతో ముందుచూపుతో

కేబీఆర్ పార్కు చుట్టూ నెలకున్న ట్రాఫిక్ సమస్యను దృష్టి లో పెట్టుకుని రానున్న 20 ఏళ్లను దృష్టి లో పెట్టుకుని ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సర్కారు హెచ్ సిటీ పనుల కింద పార్కు చుట్టూ మొత్తం ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్(Under Pass) లను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు సర్కారుకు నివేదికలను పంపించారు. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మెగా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ లిమిటెడ్(Mega Engineering Infrastructure Limited) సంస్థ పనులు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. పార్కు చుట్టూ ఆధునిక రవాణా వ్యవస్థలైన ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు నిర్మించున్నసమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని, రేపు ఆ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కింద కూడా వాహానాల తాకిడి పెరిగే అవకాశముండటం, రోడ్డు కిరవైపులా ప్రస్తుతమున్న పార్కింగ్ స్థలాలు అప్పటి అవసరాలకు సరిపోయేలా లేకపోవటంతో నవ నిర్మాణ్ సంస్థ ఈ మల్టీ లెవెల్ మెకనైజ్డ్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు సమాచారం.

Also Read: GHMC Commissioner and CDMA: అదనపు కమిషనర్ల కుదింపుపై గందరగోళం!

తక్కువ వ్యయం తక్కువ టైమ్‌లో ఎంతో వేగంగా

సిటీలో ఫస్ట్ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థగా పేరుగాంచిన కేబీఆర్ పార్కు మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థ రాష్ట్రంలోనే అతి తక్కువ సమయం, తక్కువ వ్యయంతో ఎంతో వేగంగా పనులు పూర్తి చేసుకున్న ప్రాజెక్టుగా నిలవనుంది. ఇదిలా ఉండగా, మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న అక్రమ పార్కింగ్(Wrong Parking) లకు చెక్ పెట్టడంతో పాటు కొంత మేరకు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నం కేబీఆర్ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థతో ఫలించిందనే చెప్పవచ్చు. సుమారు 20 ఏళ్ల క్రితం చార్మినార్ జోన్(Charminar Zone) లోని ఖిల్వత్ ప్రాంతంలో మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌ను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(Hyderabad) ప్రతిపాదనలను సిద్దం చేసింది. దీనికి స్టాండింగ్ కమిటీతో(Standing Committee) పాటు కౌన్సిల్ ఆమోదం కూడా ఉన్నా, ఆ ప్రతిపాదనను అమలు చేసేందుకు అధికారులు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేసినా, ఫలించలేదు. చివరి ఆ ప్రతిపాదనను ఎంసీహెచ్(MCH) రద్దు చేసుకోవల్సి వచ్చింది. ఆ తర్వాత నాంపల్లిలో మెట్రో రైలు మల్టీ లెవెల్ ఆటోమెటిక్ పార్కింగ్ కాంప్లెక్సు అందుబాటులోకి తెచ్చేందుకు 2018లో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత ఈ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధుల పరంగా అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. ఎట్టకేలకు పనులు తుది దశలో ఉన్న ఈ పార్కింగ్ కాంప్లెక్స్ ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు మెట్రో రైలు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Child Protection Wing: సైబర్ సెక్యూరిటీ బ్యూరో స్పెషల్ ఆపరేషన్!

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు