Farmers Protest( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Farmers Protest: ఆ జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు.. కలెక్టర్ రావాలని డిమాండ్

Farmers Protest:  పంటకు ఆసరా కావాల్సిన యూరియా(Urea) బస్తాలు సరైన సమయానికి లభించకపోవడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. పంటకు కావాల్సిన యూరియా(Urea) సరైన సమయంలో అధికార యంత్రాంగం అందించకపోవడంతో పంట నష్టపోతామేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్ద, మరిపెడ మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. రైతుల సమస్యలను పట్టించుకునేందుకు స్వయంగా కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు.

జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ రైతుల నినాదాలు
రహదారిపై యూరియా(Urea) కోసం ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేసేందుకు రహదారిపైకి వచ్చిన మరిపెడ సీఐ రాజకుమార్, ఎస్సై సతీష్ లను చూసి రైతులు జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ నినాదాలు హోరెత్తించారు. యూరియాను సకాలంలో అందించి రైతుల సమస్యలను తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్యాక్స్(పిఎసిఎస్) వద్ద పడికాపులు కాసిన యూరియా(Urea) బస్తా దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డులు తీసుకొని లిస్టు తయారుచేసి ఇస్తామని అగ్రికల్చర్ అధికారులు చెప్పినప్పటికీ సకాలంలో అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా ఒక్కో బస్తా కి 500 రూపాయల వరకు తీసుకుంటాడంతో అంత ఖర్చు భరించలేక రైతులు(Farmers) ప్రభుత్వం అందించే యూరియా పైనే ఆశలు పెట్టుకుంటున్నారు.

 Also Read: Star Actress: క్యాన్సర్‌తో ప్రముఖ నటి కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ!

నానో యూరియా మాకొద్దు
యూరియా(Urea)కు ప్రత్యామ్నాయంగా తయారుచేసిన నానో యూరియా మాకొద్దంటూ రైతులు(Farmers) తెగేసి చెబుతున్నారు. ఇప్పటివరకు నానో యూరియా వాడలేదని దానివల్ల ఎలాంటి లాభం జరుగుతుందో తెలియదని అలాంటప్పుడు నానో యూరియా ఎలా వాడతామని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే సకాలంలో స్పందించి రైతుల(Farmers)కు కావలసిన యూరియా బస్తాలను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫెర్టిలైజర్ షాపుల్లో యూరియాకు 500, నానో యూరియాకు 300 నుంచి 350 రూపాయలు తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే యూరియా బస్తాకు 280 అయితే బయట ఫర్టిలైజర్ షాపుల్లో కొనుక్కోవాలంటే 500 రూపాయలు వెచ్చించాల్సిన దుస్థితి ఉంటుందని చెబుతున్నారు.

యూరియా కొరత లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల(Farmers)కు కావాల్సిన యూరియా(Urea)ను ప్రభుత్వం సకాలంలోనే అందిస్తుంది. ఎక్కడా కూడా యూరియా కొరత లేదు. ఒక్కో రైతు ముందస్తుగా మేలుకొని తమ వ్యవసాయానికి సరిపడే దానికంటే ఎక్కువ యూరియాను పిఎసిఎస్ ల ద్వారా తీసుకొని నిలువ చేసుకుంటున్నారు. కొంత ఆలస్యంగా పిఎసిఎస్ సెంటర్లకు వచ్చిన రైతులకు మాత్రమే యూరియా కొరత ఉంది. గత ఏడాదిలో ఇదే సమయానికి పంపిణీ చేసిన యూరియా కంటే ఈ ఏడాది ఎక్కువ యూరియాను రైతుల(Farmers)కు అందించాం.

ప్రస్తుత సమయానికి వేయాల్సిన యూరియా(Urea) బస్తాల కంటే అదనంగా నెల రోజుల తర్వాత వేయాల్సిన యూరియా(Urea) బస్తాల కోసం కూడా రైతులు క్యూ లైన్ లో నిలబడి బస్తాల కోసం గాబరా పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అందించాల్సిన యూరియా(Urea)ను రైతులకు సజావుగానే అందిస్తుంది. మరిపెడ మండల కేంద్రానికి రావాల్సిన 2000 బస్తాలు వర్షం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో సకాలంలో మండల కేంద్రానికి యూరియా చేరుకోవడం లేదు. సోమవారం సాయంత్రానికి 2000 యూరియా బస్తాలు అందుబాటులోకి రానున్నాయి. యూరియా వచ్చిన వెంటనే రైతుల(Farmers)కు పంపిణీ చేస్తాం.

 Also Read: Transgenders: ట్రాన్స్ జెండర్లకు రుణాలిస్తున్న జీహెచ్ఎంసీ.. ఎందుకో తెలుసా..?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?