Transgenders (imagecredit:swetcha)
హైదరాబాద్

Transgenders: ట్రాన్స్ జెండర్లకు రుణాలిస్తున్న జీహెచ్ఎంసీ.. ఎందుకో తెలుసా..?

Transgenders: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో అర్థనారీశ్వరులుగా చెప్పుకునే ట్రాన్స్ జెండర్ల(Trans Genders)కు చేయూతనిచ్చేందుుకు జీహెచ్ఎంసీ(GHMC) సిద్దమైంది. గతంలో ట్రాన్స్ జెండర్లకు జీహెచ్ఎంసీలో పలు క్యాటగిరీల ఔట్ సోర్స్ పోస్టులు కేటాయించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైనప్పటికీ, అందుకు తాము సిద్దంగా లేమంటూ ట్రాన్స్ జెండర్లు తేల్చి చెప్పిన నేపథ్యంలో తమకు స్వయం ఉపాధి కల్పించాలని ట్రాన్స్ జెండర్లు కోరటంతో జీహెచ్ఎంసీ ఆ దిశగా అడుగులు వేసింది. ముఖ్యంగా మహానగరంలో ట్రాన్స్ జెండర్లు బలవంత వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు నిజం కావన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముందుకొచ్చిన కొందరు ట్రాన్స్ జెండర్లకు జీహెచ్ఎంసీ స్వయం ఉపాధి కల్పించింది.

ఒక్కోక్కరికి రూ. 50 వేలు

వారు ఎంచుకున్న యూనిట్లను బట్టి కుత్బుల్లాపూర్ (Qutubullahpur)సర్కిల్ సూరారం(Suraram) ప్రాంతంలో నివసించే పదకొండు మంది ట్రాన్స్ జెండర్లకు ఒక్కోక్కరికి రూ. 50 వేలు చొప్పున తొలి దశగా మొత్తం రూ.5.50 లక్షల రుణాలను అందజేసింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సూరారం శాఖ అందించిన ఈ రుణాలతో వారు యూనిట్లను ఏర్పాటు చేసుకుని, వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (యూసీడీ) పంకజ తెలిపారు. తక్కువ వడ్డీకే బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తున్నట్లు, వాటిని ప్రతినెల క్రమం తప్పకుండా చెల్లించేలా కూడా ట్రాన్స్ జెండర్లకు అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. స్వయం ఉపాధిపై ఆసక్తి కల్గి ముందుకొస్తే వారికి కూడా చేయూతనిచ్చేందుకు జీహెచ్ఎంసీ సిద్దంగా ఉన్నట్లు అదనపు కమిషనర్ పంకజ వెల్లడించారు.

Also Read: Nano Urea: రైతన్నలకు గుడ్ న్యూస్…ఈ యూరియాతో పంట దిగుబడులు పెరగడం ఖాయం

స్వశక్తి సంఘాల ఏర్పాటు

మహానగరంలో మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు వీలుగా ఇప్పటికే ఏర్పాటై అమల్లో ఉన్న స్వయం సహాయక బృందాలకు సమాంతరంగ్రా ట్రాన్స్ జెండర్లకు కోసం జీహెచ్ఎంసీ(GHMC) స్వశక్తి మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, వాటిల్లో ట్రాన్స్ జెండర్లకు సభ్యత్వాన్ని కల్పించినానంతరం రుణాలను మంజూరు చేశారు. తొలి దశగా పది కొండు మందికి జీహెచ్ఎంసీ(GHMC) రుణాలు అందజేయగా వీరిలో కొందరు కర్రీ పాయింట్లు, మరి కొందరు పేపర్ ప్లేట్స్ యారీ, బట్టల వ్యాపారం, జ్యూట్ బ్యాగ్స్ తయారీ, కేటరింగ్ యూనిట్ వంటివి ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Singareni: సింగరేణి మండల కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తం

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం