Star Actress: ప్రముఖ నటి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె వయసు కేవలం 38 సంవత్సరాలే. ఆ నటి ఎవరో కాదు.. ప్రియా మరాఠే (Priya Marathe). నటి ప్రియా మరాఠే క్యాన్సర్‌తో పోరాడుతూ 31 ఆగస్ట్, 2025న ముంబైలోని మీరా రోడ్‌లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రియ మరాఠే మరణం భారతీయ టెలివిజన్ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఆమె ‘పవిత్ర రిష్టా’, ‘కసమ్ సే’ వంటి అనేక హిందీ, మరాఠీ సీరియల్స్‌లో నటించి ప్రసిద్ధి చెందారు. ఆమె నటనతో ప్రేక్షకులకు చాలా దగ్గరవడమే కాకుండా, టెలివిజన్ రంగంలో స్టార్ స్టేటస్‌ని పొందారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌ఫుత్‌తో కలిసి ఆమె ‘పవిత్ర రిష్టా’ అనే సీరియల్‌లో నటించి గుర్తింపు పొందారు.
కోలుకుంది కానీ..
వాస్తవానికి చాలా కాలం క్రితమే ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ మధ్య ఆమె క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు కనిపించినా, ఆ తర్వాత క్యాన్సర్ తిరిగి వ్యాపించి, ఆమె మరణానికి దారితీసింది. ఆమె మరణంపై అభిమానులు, సహ నటులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నారు. ప్రియా మరాఠే 23 ఏప్రిల్, 1987లో ముంబైలో జన్మించారు. 2012లో ప్రియా మరాఠే నటుడు శాంతను మోఘేను పెళ్లి చేసుకుంది. శాంతను మోఘే ఎవరో కాదు.. నటుడు శ్రీకాంత్ మోఘే కుమారుడు. తన నట జీవితాన్ని మరాఠీ సీరియల్స్ ‘యా సుఖానో యా’, ‘చార్ దివాస్ సాసుచే’తో ప్రారంభించించిన ప్రియా మరాఠే.. హిందీలో ‘పవిత్ర రిష్టా’ సీరియల్‌లో చేసిన ‘వర్షా సతీష్ దేశ్‌పాండే’ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
Also Read- Ramesh Varma: నిర్మాతగా రవితేజ ‘ఖిలాడి’ దర్శకుడు.. ఫస్ట్ సినిమా ఏంటంటే?
ఆమె నటించిన సినిమాలివే..
సీరియల్స్‌లోనే కాకుండా ప్రియా మరాఠే హిందీ చిత్రం ‘హమ్నే జీనా సీఖ్ లియా’ (2008), మరాఠీ చిత్రం ‘టి ఆనీ ఇతర్’లలో కూడా నటించారు. ఆ తర్వాత పెద్దగా ఆమె వెండితెరపై ఫోకస్ పెట్టలేదు. ఆమె మరణం అభిమానులను, సహ నటులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ప్రియ మరాఠే హిందీ, మరాఠీ రెండు భాషల సీరియల్స్‌లోనూ నటించారు. ఆమె నటించిన కొన్ని ప్రముఖ సీరియల్స్, అందులో ఆమె పాత్రల పేర్లు ఇవే..
పవిత్ర రిష్ట (Pavitra Rishta): ఇది ఆమెకు హిందీ టీవీ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్‌లో ఆమె వర్షా సతీష్ దేశ్‌పాండే అనే ప్రధాన పాత్రను పోషించారు.
కసమ్ సే (Kasamh Se): ఈ సీరియల్‌లో ఆమె విద్యా బాలి పాత్రలో నటించారు. ఇది ఆమె హిందీ టీవీ అరంగేట్రం.
సాత్ నిభానా సాథియా (Saath Nibhaana Saathiya): ఈ సీరియల్‌లో ఆమె భవానీ రాథోడ్ అనే నెగెటివ్ పాత్రలో నటించారు.
బడే అచ్చే లగ్తే హై (Bade Achhe Lagte Hain): ఇందులో జ్యోతి మల్హోత్రా అనే సహాయక పాత్రలో కనిపించారు.
Also Read- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!
మరాఠీ సీరియల్స్:
యా సుఖానో యా (Ya Sukhano Ya): ఈ సీరియల్‌తోనే ఆమె తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇందులో ఆమె పావని అధికారి పాత్రలో నటించారు.
చార్ దివాస్ సాసుచే (Char Divas Sasuche): ఇందులో ఆమె సోనా అశోక్ దేశ్‌ముఖ్ పాత్ర పోషించారు.
తు టిథే మే (Tu Tithe Me): ఇందులో ఆమె ప్రియా మోహితే అనే నెగెటివ్ రోల్‌లో నటించారు.
తుజెచ్ మి గీత్ గాత్ ఆహి (Tuzech Mi Geet Gaat Aahe): ఇందులో మోనికా కామత్ పాత్రలో నటించారు.
స్వరాజ్యరక్షక్ సంభాజీ (Swarajyarakshak Sambhaji): ఇందులో గోదావరి పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు