Kokkorokko Opening
ఎంటర్‌టైన్మెంట్

Ramesh Varma: నిర్మాతగా రవితేజ ‘ఖిలాడి’ దర్శకుడు.. ఫస్ట్ సినిమా ఏంటంటే?

Ramesh Varma: దర్శకుడు రమేష్ వర్మ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే. ఆయన దర్శకుడిగా రవితేజ (Ravi Teja) తో రెండు సినిమాలు చేశారు. అవి రెండూ డిజాస్టర్స్ అయ్యాయి. రవితేజ, కాజల్ అగర్వాల్, తాప్సీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీర’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిస్తే.. రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కాంబోలో వచ్చిన ‘ఖిలాడి’ సినిమా యావరేజ్ టాక్‌ని మాత్రమే సొంతం చేసుకుంది. ఇక ఆయన డైరెక్ట్ చేసిన ‘రైడ్’, ‘రాక్షసుడు’ సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ చిత్రాలుగా నిలిచి, దర్శకుడిగా రమేష్ వర్మ (Ramesh Varma)కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ‘ఖిలాడి’ సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. మధ్యలో ‘కాలభైరవ’ అంటూ ఓ సినిమాను అనౌన్స్ చేశారు కానీ, అది ప్రకటనకే పరిమితమైంది. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన నుంచి సినిమా ప్రకటన వచ్చింది.

నిర్మాతగా న్యూ బ్యానర్
ఇప్పటి వరకు దర్శకుడిగా, కొన్ని సినిమాలకు సహనిర్మాతగా ఉన్న రమేష్ వర్మ.. ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్మాతగా మారుతున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు గానూ ‘ఆర్‌వి ఫిల్మ్ హౌస్’ అనే బ్యానర్‌ను ఆయన అనౌన్స్ చేశారు. అంతేకాదు, ఈ బ్యానర్‌లో వచ్చే మొదటి చిత్ర వివరాలను కూడా ఆయన అధికారికంగా ప్రకటించారు.

Also Read- Bigg Boss Telugu 9: ‘బిగ్‌బాస్‌’లోకి ఫోక్ డాన్సర్.. అయితే మాత్రం హౌస్ దద్దరిల్లాల్సిందే..

‘కొక్కొరొకో’ (Kokkorokko)
ఆర్‌వి ఫిల్మ్ హౌస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా రాబోతున్న చిత్రానికి ‘కొక్కొరొకో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆదివారం (ఆగస్ట్ 31) సంస్థ ఆఫీస్‌లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ముహూర్తపు షాట్‌కు నిర్మాత రేఖా వర్మ క్లాప్ కొట్టగా.. నిర్మాత కూరపాటి శిరీష కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రమేష్ వర్మ స్క్రిప్ట్‌ను దర్శకుడు శ్రీనివాస్ వసంతలకు అందజేశారు. ఈ మూవీతో శ్రీనివాస్ వసంతల దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

మరోసారి దేవిశ్రీ తమ్ముడు
వినూత్నమైన కథతో, ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా శ్రీనివాస్ వసంతల ఈ మూవీని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రముఖ స్క్రీన్ రైటర్ జి. సత్యమూర్తి కుమారుడు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు, నేపథ్య గాయకుడు జివి సాగర్ మరోసారి రమేష్ వర్మ ప్రాజెక్ట్‌కు పని చేస్తున్నారు. ఆల్రెడీ రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రానికి జివి సాగర్ సంభాషణలు అందించిన విషయం తెలిసిందే. మళ్లీ ‘కొక్కొరొకో’ చిత్రానికి ఆయన సంభాషణలు రాసే బాధ్యతను స్వీకరించారు. ‘రాక్షసుడు’ తర్వాత రచయితగా ఆయన చేస్తున్న రెండో ప్రాజెక్ట్‌ కూడా ఇదే కావడం విశేషం.

Also Read- Pawan Kalyan: లేట్ నైట్ అల్లు అరవింద్‌ ఇంటికి వెళ్లిన డిప్యూటీ సీఎం.. అందుకు బాధగా ఉందన్న పవన్

ఆంథాలజీగా
ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను రమేష్ వర్మే స్వయంగా అందిస్తున్నారు. ఆర్‌వి ఫిల్మ్ హౌస్ బ్యానర్‌లో మొదటి చిత్రంగా రాబోతున్న ఈ సినిమా.. తెలుగులో ఓ చక్కటి ఆంథాలజీ కానుందని, అద్భుతమైన విజువల్స్, మంచి ఎమోషన్స్‌తో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం అవుతుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని రేఖా వర్మ, కూరపాటి శిరీష నిర్మాతలుగా, నీల్లాద్రి ప్రొడక్షన్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్‌గా సంకీర్తన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం