50 Years for Balakrishna: బాలయ్య 50 ఇయర్స్ సినీ కెరీర్‌ను పురస్కరించుకుని అభినందనలు తెలుపుతూ రజినీకాంత్ ఓ వీడియోను విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా జైత్రయాత్ర 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతోన్న సంగతి తెలిసిందే. భారతీయ సినిమాలో 50 సంవత్సరాలు హీరోగా కొనసాగుతున్న ఏకైక హీరోగా ఆయన చరిత్ర సృష్టించారు. తన కెరీర్ అంతటా, బాలయ్య తన తండ్రి, లెజెండరీ నందమూరి తారక రామారావు (NTR) శాశ్వత వారసత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా, టాలీవుడ్‌లో తన ఆల్ రౌండర్ ప్రతిభతో, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కళపట్ల అవిరామమైన నిబద్ధతతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్నారు. భారతీయ సినిమాలో హీరోగా ఆయన అసాధారణ సేవలకు గుర్తింపుగా.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్య పేరును నమోదు చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ట్రైడెంట్ హోటల్‌లో శనివారం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలయ్యకు సూపర్ స్టార్ రజినీకాంత్ అభినందనలు తెలిపారు.
Also Read- Dulquer Salmaan: భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రం.. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది
ఆయనకు పోటీ ఆయనే
‘‘అందరికీ నమస్కారం.. ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింగం ముందు కాదు, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా… ఇలాంటి పంచ్ డైలాగులు ఓన్లీ బాలయ్య చెబితేనే బాగుంటుంది కానీ, వేరే వాళ్లు చెబితే అస్సలు బాగుండదు. బాలయ్య అంటే పాజిటివిటి. ఆయన దగ్గర కొంచెం కూడా నెగిటివిటీ ఉండదు. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ నవ్వు, సంతోషం, పాజిటివిటి ఉంటుంది. ఆయనకు పోటీ ఆయనే. వేరే ఎవ్వరూ లేరు. బాలయ్య పిక్చర్ బాగా ఆడుతుందంటే, ఆయన అభిమానులే కాదు, అందరూ హీరోల అభిమానులు ఆ సినిమాను ఇష్టపడతారు. అది ఆయన స్ట్రెంత్. ఇప్పుడాయన సినిమాలు చేస్తూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అందుకు నా అభినందనలు. ఇంకా ఆయన ఇలాగే సినిమా ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తూ.. పాజిటివిటిని స్ప్రెడ్ చేస్తూ.. సంతోషంగా 75 ఇయర్స్ కంప్లీట్ చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని రజినీకాంత్ ఈ వీడియో ద్వారా బాలయ్యకు అభినందనలు తెలిపారు.
Also Read- Allu Kanakaratnamma: ముగిసిన అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన చిరు, మనవళ్లు!
ఘన సత్కారం
హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి నటసింహాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్, బాలయ్య కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై బాలయ్యకు సినిమా ఇండస్ట్రీ పట్ల ఉన్న అంకితభావాన్ని కొనియాడారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు చేరడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి మరి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారెంతగానో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
When LEGEND celebrate LEGEND ❤️🔥
Superstar #Rajinikanth garu conveys his heartfelt wishes to Natasimham #NandamuriBalakrishna garu for being honoured with the World Book of Records, Gold Edition Recognition on completing 50 glorious years as a Hero in Indian Cinema 💥… pic.twitter.com/9BTYZHsZNr
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 30, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు