Dulquer Salmaan: ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక 1: చంద్ర’ (Lokah: Chapter One – Chandra) చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. వేఫేరర్ ఫిల్మ్స్ (Wayfarer Films) పతాకంపై నిర్మించిన ఏడవ చిత్రం ఇది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ మలయాళ చిత్రం.. కేరళ సరిహద్దులను దాటి సత్తా చాటుతోంది. ఈ సినిమాపైనే కాకుండా, నిర్మించిన దుల్కర్ సల్మాన్, ఆయనకు చెందిన వేఫేరర్ ఫిలిమ్స్‌పై కూడా ప్రశంసలు వర్షం కురుస్తుండటం విశేషం. మలయాళ సినీ ఇండస్ట్రీలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అత్యంత భారీస్థాయిలో, భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read- Allu Kanakaratnamma: ముగిసిన అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు.. పాడె మోసిన చిరు, మనవళ్లు!
కొత్త అధ్యాయానికి శ్రీకారం
హై టెక్నికల్ సాంకేతిక పరిపూర్ణతతో నిర్మించి, దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) అసాధారణమైన అడుగు ముందుకు వేశాడని అంతా కొనియాడుతున్నారు. దీనిని ఓ మలయాళ నిర్మాత తీసుకున్న అత్యంత సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన నిర్ణయంగా అంతా వర్ణిస్తున్నారు. ‘కొత్త లోక 1: చంద్ర’ సినిమాతో కొత్త సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకొస్తున్న టాక్‌తో.. మలయాళ సినిమా స్థాయిని పెంచడానికి, సరిహద్దులను దాటి విస్తరించేందుకు వేఫేరర్ ఫిలిమ్స్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందనేలా మాట్లాడుకుంటున్నారు. మలయాళ చిత్రాలకు, కంటెంట్‌కు ఎప్పుడూ పెద్ద పీటే ఉంటుంది. అదిప్పుడు ‘కొత్త లోక 1: చంద్ర’తో మరో మైలురాయికి చేరిందనేలా విమర్శకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం విశేషం. దుల్కర్ సల్మాన్ వేసిన ఈ సాహసోపేతమైన అడుగు.. భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోతుందని అంటున్నారు.
Also Read- Sugali Preethi Case: పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ వైరల్!
ప్రధాన బలాలివే..
‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం గొప్పగా రూపుదిద్దుకోవడంలో డొమినిక్ అరుణ్ కీలక పాత్ర పోషించారని.. రచయితగా, దర్శకుడిగా ఆయన సినిమాను అద్భుతంగా దృశ్యరూపం చేసి, తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారని టీమ్ అంతా మాట్లాడుకుంటోంది. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి, కళా దర్శకులు బంగ్లాన్, జితు సెబాస్టియన్, నేపథ్య సంగీతం అందించిన స్వరకర్త జేక్స్ బెజోయ్‌లతో పాటు చమన్ చాకో కూర్పు, అంతర్జాతీయ స్టంట్ నిపుణుడు యానిక్ బెన్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా విమర్శకులు చెబుతున్నారు. ఈ చిత్రానికి కేరళలో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుండటంతో నిర్మాత దుల్కర్ సల్మాన్ ధన్యవాదాలు తెలిపారు. టైటిల్ రోల్ పోషించిన కళ్యాణి ప్రియదర్శన్, ఇతర ముఖ్య పాత్రలలో కనిపించిన నస్లెన్, శాండీ, చందు సలీం కుమార్, అరుణ్ కురియన్, విజయరాఘవన్, శరత్ సభతో పాటు అతిథి పాత్రలు పోషించిన నటులు కూడా సినిమాకు ప్లస్సయ్యారని రివ్యూస్ కూడా చెబుతున్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేశారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనూ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నట్లుగా నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు