Mahabubabad district: ఆధార్ కోసం అందుడి కష్టాలు. కళ్ళు లేకపోయినా ఐరిష్ టెస్టులంటూ ఆధార్ సెంటర్ల ఆగడాలు. వివరాల్లోకి వెళితే మహబూబాబాద్(Mahabubabad) జిల్లా నరసింహుల పేట మండలం పెద్ద నాగారం గ్రామానికి చెందిన నాగన్న పుట్టుకతోనే అంధుడు. అయితే తన ఆధార్ కార్డులో వివరాలు సరి చేయించేందుకు గత కొన్ని నెలలుగా పలుమార్లు మీసేవ(Mee Seva) కేంద్రాలు, ఆధార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఎక్కడ నుండి సరైన స్పందన రాలేదు. ఐరిష్ స్కాన్ తప్పనిసరి అని అధికారులు చెబుతుంటే నాకు కండ్లు లేవు ఐరిష్ స్కాన్(Irish Scan) ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్న నాగన్న పరిస్థితి హృదయాన్ని కలచివేస్తుంది.
Also Read: Drug Addicts: మత్తుకు బానిసలవుతున్న వైద్యులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటాలు
60 ఏళ్ల అమ్మతో కలిసి తిరుగుతూ
వయస్సుతో మెల్లగా కదులుతున్న తల్లి కూడా ఆయన వెంట తిరుగుతూ ఉంది. కానీ 60 ఏళ్ల అమ్మతో కలిసి అధికారుల దగ్గర తిరుగుతూ అడగడమే ఓ పెద్ద పనిగా మారింది. ఆధార్(Adhaar) సెంటర్ సిబ్బంది ఐరిస్ స్కాన్ లేకుండా అప్డేట్ కుదరదని ఖరాఖండిగా చెబుతూ తిరస్కరిస్తూ వస్తున్నారు. దీంతో దృష్టి లేని వ్యక్తులైన వారు ఆధార్ వివరాల్లో మార్పులు చేసుకోవడం అసాధ్యం అవుతుంది. అందులకు ఐరిష్ స్కాన్ మినహాయింపు, ఇతర ప్రత్యామ్నాయలు అందుబాటులోకి తేవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మీసేవ కేంద్రాల్లో అందులకు ప్రత్యేక సదుపాయాలు ఉండాలని బయోమెట్రిక్(Biometric) మినహాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పలుమార్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఏం చేయాలో తెలియడం లేదు అంటూ అందరూ మీసేవ కేంద్రాలలో గగ్గోలు పెడుతున్నారు. అందులకు ప్రత్యేక ఆధార్ సవరణలు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ తెరపైకి వస్తుంది.
Also Read: Thalliki Vandanam: పేరు మార్చినంత మాత్రాన ‘తల్లికి వందనం’ కొత్తదైపోతుందా..?