Land Scams: రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం చర్చల్లో ఉండే ప్రాంతం ఫోర్త్ సీటి. ఈఫోర్త్ సీటిలోని మహేశ్వరం నియోజకవర్గం భూ వివాదాలకు (Land Scams) కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ప్రభుత్వ అధీనంలో ఉండే భూములు రియల్ వ్యాపారులకు కబ్జాలు, పట్టాలు చేసుకున్నారనే ప్రధానమైన ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలతో ప్రస్తుతం జిల్లాల్లో పనిచేసే రెవెన్యూ అధికారులు, సిబ్బంది జంకుతున్నారు. రెవెన్యూ నిబంధనలకు అనుగుణంగా , వివాదరహితమైన భూములను పరిశీలించి పట్టాదారులకు న్యాయం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంగా కొంత మంది వ్యక్తులు అధికార పార్టీ నేతల పేరుతో ఓ నాయకుడు, ప్రభుత్వంలోని ఓ చిరుద్యోగి కలిసి వివాదస్పదమైన భూములు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఆ భూమి సమస్యను పరిష్కారించేందుకు ఆ చిరుద్యోగి ఆవ్యాపారితో కుమ్మక్కై రెవెన్యూలో పనిచేసే డిప్యూటీ తహశీల్ధార్ మొదలు జేసీ చాంబర్లోని ఓ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులతో కలిసి ఫైరవీలకు పదును పెడుతున్నారు. వివాదస్పదమైన భూములను ఆ ఉద్యోగి తప్పుడు ఆలోచనలతో వారిని మ్యానేజ్ చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు.
Also Read: Land scam: హయత్నగర్లో ఆగని అక్రమ భూదందాలు.. పట్టించుకోని అధికారులు
అధికారులను మభ్యపెట్టి రిజిస్ట్రేషన్లు
ఇప్పటికే మహేశ్వరం మండలం అంటే అధికారులు భయపడుతున్న పరిస్థితి కనిపించిన కొంత మంది ఉద్యోగులు తమకేమీ తెలియదనట్లు వ్యవహారిస్తున్నారు.మహేశ్వరం మండలం మన్సన్పల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 189 సర్వే నెంబర్ భూమిలో వివాదం నడుస్తుంది. అయినప్పటికి ఈ భూమిపై ఇప్పటికే పలు ఫిర్యాదులున్నా అధికారులు పట్టించుకోకుండా కాసులకు కక్కిర్తి పడి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే అక్టొంబర్ 15వ తేదీన రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించిన అధికారిని బలవతంగా సాయంత్రం సమయంలో దగ్గరుండి డాక్యుమెంట్ చేయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 189 సర్వే నెంబర్లో క్రయవిక్రయాలు సక్రమంగ ఉన్నప్పటికి బుకింగ్ చేసుకున్న స్లాట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయలేదు. ఎందుకు మధ్యాహ్నం వరకు మీనామేషాలు లెక్కిస్తూ లావాదేవీల ఓప్పందం తర్వాతే సంబంధిత అధికారి రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ చేయించేందుకు అధికారికి వ్యాపారికి మధ్యవర్తిగా ఉన్న చిరుద్యోగికి సుమారుగా రూ.15లక్షల డీల్ నడిపించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ సదరు ఉద్యోగి ఓప్పందంలో భాగంగా వచ్చిన నగదుతో క్రేట కారును తీసుకున్నారని స్థానికులు జోరుగా చర్చించుకుంటున్నారు.
నిషేధిత భూమికి క్లియరెన్స్?
మహేశ్వరం మండలంలోని మన్సన్పల్లి రెవెన్యూలోని 189 సర్వే నెంబర్ భూమి డబూల్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావడంతో వివాదంలో ఉంది. అయితే ఇదే సర్వే నెంబర్లో ఓ సబ్ డివిజన్ నెంబర్ పీవోబీలో ఉంటే ఆఫైల్ క్లియర్ చేయించే పనిలో ఆ చిరుద్యోగి జేసీ చాంబర్లోని ఓ జూనియర్ అసిస్టేంట్తో సహాయంతో ఫైల్ ముందుకు కదిలించినట్లు సమాచారం. అంతేకాకుండా జేసీ నుంచి కలెక్టర్ వద్దకు ఫైల్ వెళ్తే మరిన్ని వివరాలు కావాలని వెనక్కి పంపించారు. అయినప్పటికి క్షణాల్లో మరిన్ని వివరాలు జోడించి కలెక్టర్కు ఫైల్ పెట్టినట్లు సమాచారం. సామాన్య ప్రజలకు స్పందించన సిబ్బంది… వ్యాపారుల ఫైల్స్కే ప్రాధాన్యతనిస్తూ దగ్గరుండి, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ నిషేధిత భూమి క్లియరెన్స్ పనిలో నిమగ్నమైతున్నారు.
క్షేత్రస్థాయి అధికారిపై నమ్మకంతోనే అడుగు
ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులు చేసే విధులపై నమ్మకంతోనే ఫైల్స్ పై సంతకం చేస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సులభంగా తప్పించుకునేందుకు క్షేత్రస్థాయిలోని అధికారులు ప్లానింగ్ వెతుకుంటారు. భూ భాధితుడు ఇచ్చిన పత్రాలనే ఆసరాగా చేసుకోని ఫైల్స్ ముందుకు పంపడంపై అనేక సమస్యలు వస్తున్నాయి. సమస్య పరిష్కారం దిశగా ఉన్నప్పుడు ఎలాంటి వాళ్లకు ఏవిధమైన అనుమానాలు అవసరం లేదు. కానీ పరిష్కారం కానీ సమస్యలతోనే అధికారులకు పరేషాన్ ఉంటుంది. 189 సర్వే నెంబర్లో అదే తంతంగా నడుస్తుంది. ఎన్నో యేండ్లుగా డబూల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సమస్య కొనసాగుతుంది. ఈ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి లేకపోయినప్పటికి పట్టాదారుల మధ్యే పంచాయతీ ఉంది. పట్టాదారుడు ఏ అనే వ్యక్తి డాక్యుమెంట్ చేశారు.
గిరిజనులను ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లగోట్టే కుట్ర
అదే పట్టాదారుడు మరో బి అనే వ్యక్తికి డాక్యుమెంట్ చేశారు. దీంతో ఒకే పట్టాదారుడు ఇద్దరికి డాక్యుమెంట్ చేశారు. ఇందులో ఏ డాక్యుమెంట్ క్యాన్సల్ చేయలేదు. కానీ బీ అనే డాక్యుమెంట్ వ్యక్తి మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడంపై అనుమానాలకు తావునిస్తుంది. ఎందుకంటే ఏ గానీ, బీగానీ భూమిపై కబ్జాలో లేకపోవడం విశేషం. కేవలం గిరిజనులు భూమిలో సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ రియల్ వ్యాపారులంత కలిసి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రాజకీయ, అంగ బలంతో గిరిజనులను ఫీల్డ్ నుంచి బయటికి వెళ్లగోట్టే కుట్ర చేస్తున్నారు. ఫైరవీకారులతో అధికారులు కుమ్మక్కై భూ వివాదాలను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈవిషయంపై విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గిరిజనలు వాపోతున్నారు.
Also Read: Bachupally Land Scam: బాచుపల్లిలో బడా భూస్కాం.. పైల్ డీ నోటిఫై చేసేందుకు అధికారుల తంటాలు
