Mahabubabad District: లంబాడీలఎస్టీ జాబితా తొలగించొద్దు
Mahabubabad District(IMAGE CREIT; SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Mahabubabad District: లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించొద్దని ఎల్‌హెచ్‌పీఎస్ డిమాండ్

Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఎల్‌హెచ్‌పీఎస్ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎల్ హెచ్ పి ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ బోడ లక్ష్మణ్ నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆంగోత్ చందులాల్ మాట్లాడుతూ.. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని భద్రాచలం ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబూరావు ఇద్దరు సుప్రీంకోర్టులో ఎస్టీ జాబితా నుండి లంబాడి కులస్తులను తీసివేయాలని వేసిన పిటిషన్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని అన్నారు.

 Also Read: Star Heroine: నానితో రొమాన్స్.. పెద్ద టార్చర్.. ఇంకోసారి అతనితో ఆ బెడ్ రూమ్స్ సీన్స్ చేయను?

 65 లక్షల మంది లంబాడీలు

కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ లో ఉంటూ లంబాడీలను దృష్టి జాబితా నుండి తీసివేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తెల్ల వెంకటరావు, సోయం బాబురావును తక్షణమే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని అన్నారు. లంబాడీలను 1976లో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందని, ఆర్టికల్ 342 ప్రకారం యాక్ట్ 108 ద్వారా ఎస్టీ జాబితాలో పొందుపరచడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది లంబాడీలు ఉన్నారని అన్నారు. 1976 సంవత్సరంలో పార్లమెంటులో బిల్లు పాసై, రాష్ట్రపతి ఆమోదం తెలిపి, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఎస్టీ జాబితాలో లంబాడీలను చేర్చారని, నిబంధనలకు అనుగుణంగానే ఎస్టీ జాబితాలో లంబాడీలను చేర్చారని, కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తప్పుడు ప్రచారం చేసి రాజకీయ పబ్బం కడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు. ఆదివాసీలు ఆయా రాష్ట్రాల్లో ఆయా రిజర్వేషన్లలో, కొనసాగుతున్నారని, లంబాడీలు కూడా భారతదేశంలో మూడు రాష్ట్రాల్లో ఎస్టి జాబితాలో, 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా కొనసాగుతున్నారని అన్నారు.

 మన హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దాం

వివిధ రాష్ట్రాల్లో వివిధ సామాజిక ,సాంస్కృతిక పరంగా ఆయా రాష్ట్రాల్లో ఆయా రిజర్వేషన్లను కొనసాగుతున్నారని, తెలంగాణలో లంబాడీలు ఎస్టీ జాబితాలో కొనసాగుతున్నారని అన్నారు. గిరిజనులంతా ఆదివాసీలు, లంబాడీలు కలిసిమెలిసి ఉంటున్నారని, ఈ యొక్క సోదరుల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది తప్పుడు వాదనలు కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, ఆదివాసి ప్రజలారా మీరు ఈ యొక్క తప్పుడు విధానాలను అవలంబిస్తున్న రాజకీయ నాయకుల చెంతకు చేరవద్దని, మనమందరం ఉందామని, మన హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎస్ ఓ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడా చందులాల్, ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు అజ్మీర శ్రీనివాస్ నాయక్, మూడ్ రవి నాయక్, బానోత్ పవన్ నాయక్, బాణోత్ భాస్కర్ నాయక్,కృష్ణ నాయక్, ఇస్లావత్ కేశ్య నాయక్, మీట్యా నాయక్,సుధాకర్ నాయక్,నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక పరిణామం.. రన్యారావుకు రూ.102 కోట్ల జరిమానా విధింపు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..