Krithi Shetty: యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ ఒక్క చిత్రంతో ఆమె పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మార్మోగిపోవడమే కాక, వరుసగా అవకాశాలు కూడా దూసుకెళ్లింది.
Also Read: MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
‘బంగార్రాజు’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అయితే, ఈ చిత్రాలు యావరేజ్ గా నిలిచాయి. కానీ, ఆ తర్వాత కృతి శెట్టి కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మనమే’, ‘కస్టడీ’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
Also Read: Hanuman Lord: హనుమాన్ కిందకి దిగి వచ్చాడు.. ఇదిగో ప్రూఫ్.. దేవుడని మొక్కి పూజలు మొదలు పెట్టండి ఇక?
ఆసక్తికరంగా, కృతి తన మొదటి చిత్రం ‘ఉప్పెన’లోనే ధైర్యమైన పాత్రలో కనిపించింది, దీంతో ఆమెకు ఇలాంటి పాత్రలు మరిన్ని వచ్చాయి. ముఖ్యంగా ‘శ్యామ్ సింగరాయ్’లో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ అందర్ని షాక్ కి గురి చేశాయి. అయితే, ఈ సీన్స్ తనకు అసౌకర్యంగా అనిపించాయని కృతి ఇటీవల వెల్లడించింది. ఈ అనుభవం ఆమె కెరీర్‌కు కాస్త నష్టం కలిగించిందని, ఇకపై ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు చేయాలంటే తనకు సౌకర్యవంతంగా అనిపించే పాత్రలను మాత్రమే ఆమె స్పష్టం చేసింది. ఈ విధంగా, తను చేసిన బోల్డ్ పాత్రల వల్ల తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడిందని కృతి పరోక్షంగా తెలిపింది.