Ranya Rao: గతేడాది మార్చి 3న ఏకంగా 14.8 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ, బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన కన్నడ సినీనటి రన్యారావు కేసులో (Ranya Rao) మంగళవారం అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ‘ది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్’ (DRI) బుధవారం రన్యారావుకు ఏకంగా రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఆమెతో పాటు బంగారం యజమానిగా ఉన్న తరుణ్ కొండరాజు అనే వ్యక్తికి రూ.63 కోట్ల భారీ జరిమానా విధించినట్టు మంగళవారం వివరాలు వెల్లడించింది. ఇక, జ్యువెల్లర్స్ యజమానులు సాహిల్ సకారియా, భారత్ కుమార్ జైన్‌లపై చెరో రూ.56 కోట్ల మేర జరిమానా విధించినట్టు ప్రకటనలో వివరించింది.
Read Also- Jatadhara Movie Update: శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్!.. పండగ చేసుకుంటున్న నిర్మాత
ఈ మేరకు డీఆర్‌ఐ అధికారులు మంగళవారం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న ఆయా వ్యక్తుల వద్దకు వెళ్లి 250 పేజీలతో కూడిన నోటీసులను అందజేశారు. మొత్తం 2,500 అనుబంధ పేజీలను కూడా ప్రతి ఒక్కరికీ అందచేశారు. సాక్ష్యాలను బలపరిచే పత్రాలతో కూడిన నోటీసును రూపొందించడం అత్యంత క్లిష్టమైన పని అని, అయితే, ఆ పనిని మంగళవారం పూర్తి చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 11,000 పేజీల డాక్యుమెంట్లను నిందితులకు అందజేశామని డీఆర్ఐ వర్గాలు తెలిపారు.
Read Also- Jatadhara Movie Update: శిల్పా శిరోద్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్!.. పండగ చేసుకుంటున్న నిర్మాత
అసలు ఏంటీ కేసు?
కన్నడ సినీ నటి రన్యారావు 2024 మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపహగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు 14.8 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసి పట్టుబడింది. విచారణలో భాగంగా ఆమె కూడా రూ.2.06 కోట్ల విలువైన బంగారం, రూ.2.67 కోట్ల నగదు, రూ.473 కోట్ల విలువైన ఇతర ఆస్తులను కూడా విచారణాధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు రూ.17.29 కోట్ల విలువైన వాటిని జప్తు చేశారు. డీఆర్ఐ అధికారులు.. రన్యారావును దాదాపు 3 రోజుల పాటు విచారించారు. కోర్టు అనుమతి మేరకు ప్రశ్నించారు. మొత్తం 17 బంగారు కడ్డీలు స్మగ్లింగ్ చేసినట్టు ఆమె ఒప్పుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్, భాగస్వామ్యాలు చెప్పినట్టుగా ఆమె కొన్నేళ్ల వ్యవధిలోనే ఏకంగా 52 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన డబ్బును హవాలా మార్గంలో చెల్లించినట్టు గుర్తించారు.
Read Also- SSMB29 Kenya Shoot: ఆ క్రేజ్ ఏంటి భయ్యా.. ఖండాలు దాటిపోయింది.. నువ్వు దేవుడివి సామీ