Kothagudem DSP: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్ అధికారి
Kothagudem DSP ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Kothagudem DSP: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలి : కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్

Kothagudem DSP: రహదారులపై నిత్యం జరిగే ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి ప్రత్యేక కృషి చేయాలని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. కొత్తగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను డిఎస్పి రెహమాన్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ముందుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేసే సిబ్బంది కోసం ప్రక్కనే ఉన్న భావనంలో విశ్రాంతి గదులను ప్రారంభించారు.

Also Read: Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!

ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై నిత్యం పట్టణ ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడుపుతూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలకు సేవలందించాలి

డిసెంబర్ నెల చివరి వారంలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో తమ వంతు భాద్యతలను నిర్వర్తించాలని సూచించారు. రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ లకు పాల్పడే వారికి జరిమానాలు విధించాలని అన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ ను తనిఖీ చేశారు.ప్రతి ఒక్కరూ విధుల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలందించాలని కోరారు.చివరగా పోలీస్ స్టేషన్లో అధికారులు, సిబ్బంది మధ్యలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం 3టౌన్ సీఐ శివప్రసాద్,ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్ సురేష్,సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Kothagudem DSP: గంజాయి కేసులతో సంబంధం ఉన్న వ్యక్తులకు డీఎస్పీ కౌన్సిలింగ్!

Just In

01

Ranga Reddy District: పట్టా భూములను కబ్జా చేస్తున్న బిల్డర్లు.. కోర్టు కేసులను లెక్కచేయకుండా బరితెగింపులు!

Singireddy Niranjan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 27 వేల ఎకరాలు భూసేకరణ చేశాం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి!

AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!