Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ?
Bhadradri Kothagudem (Image CREDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలోని వైద్యసేవలపై ప్రభుత్వం స్టడీ చేస్తున్నది. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రులు సక్సెస్ కావడంతో ప్రభుత్వం పరిశీలన మొదలు పెట్టింది. టీవీవీపీ పరిధిలో 7 ప్రధాన దవాఖాన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ సక్సెస్ ఫుల్‌గా చికిత్స అందుతున్నట్లు ప్రభుత్వం భావిస్తున్నది. ఇటీవల కొన్ని క్రిటికల్ కేసుల పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించి ప్రాణాలు కాపాడటమే ఇందుకు నిదర్శనంగా ఆఫీసర్లు చెబుతున్నారు. పైగా ఏజెన్సీ ఏరియాలో ఉండే ఈ దవాఖాన్లలోని పనితీరుపై సర్కార్ కూడా ఆసక్తిగా అబ్జర్వ్ చేస్తున్నది. సాధారణ మనుషుల నుంచి కలెక్టర్లకు, ఇతర కీలక ఆఫీసర్లకూ ఆయా దవాఖాన్లలో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు.

ప్రభుత్వం ఆ జిల్లాలోని వైద్య సేవలపై స్టడీ

ఓపీ, డయాలసిస్, బ్లడ్ స్టోరేజ్, డెలివరీలు, సర్జరీలు వంటి సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఏకంగా జాతీయ కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ ఎమ్) టీమ్‌తో ప్రశంసలు పొందాయి. పూర్తిగా అటవీ ప్రాంతమైన చర్ల హాస్పిటల్‌లోనూ విజయవంతంగా ట్రీట్‌మెంట్లు అందిస్తూ ఇతర దవాఖాన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతోనే ప్రభుత్వం ఆ జిల్లాలోని వైద్య సేవలపై స్టడీ చేస్తున్నది. తాజాగా హెల్త్ సెక్రెటరీ ఆదేశాలతో టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ కూడా ఆ జిల్లాకు వెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. అక్కడి అధికారులు కూడా హెల్త్ సెక్రెటరీకి ప్రత్యేక నివేదిక అందించినట్లు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య సేవల తరహాలోనే మిగతా ఐటీడీఏ ప్రాంతాల్లోనూ సేవలు మెరుగు పడాలని సెక్రెటరీ ఆఫీసర్లకు సూచించినట్లు సమాచారం.

సంక్షోభం నుంచి సక్సెస్ వైపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు ఒకప్పుడు సంక్షోభంలో ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ హాస్పిటల్స్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత జిల్లా కలెక్టర్ జితేష్​ పాటిల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు నిరంతర పర్యవేక్షణ, టీవీపీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ మార్పు సాధ్యపడిందని వైద్యులు చెబుతున్నారు. ఈ జిల్లాలో గతంలో క్రిటికల్ కేసులన్నీ హైదరాబాద్, ఖమ్మంకు వెళ్లేవని, కానీ ఇప్పుడు విషమ పరిస్థితుల్లోని పేషెంట్లను సకాలంలో వైద్యం అందిస్తూ, ఆత్మవిశ్వాసం కల్పిస్తూ కాపాడుతున్నామని డాక్టర్లు చెబుతున్నారు. అశ్వరావుపేట సీహెచ్‌సీలో పారక్వాట్ తాగిన పేషెంట్‌ను కాపాడటం, చర్ల హాస్పిటల్‌లో ప్రైవేట్ దవాఖాన్లు చేతులు ఎత్తేసిన పేషెంట్‌కు ప్రాణాలు నిలపడం వంటివి ఇందుకు నిదర్శనంగా వైద్యులు వివరిస్తున్నారు. ఇటీవల ఐఏఎస్ ఆఫీసర్లు అనుదీప్ , ఐటీడీఏ పీవో రాహుల్, కలెక్టర్ జితేష్​ పాటిల్‌లు కూడా వాళ్ల భార్యలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించుకొని ఆదర్శంగా నిలిచారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఇల్లెందు ఆసుపత్రిని విజిట్ చేసి సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

Also ReadBhadradri Kothagudem: నాణ్యతలేని సెంట్రల్ లైటింగ్ పనులు.. ప్రమాదాలకు మారుపేరుగా మారాయని స్థానికులు ఆగ్రహం!

స్పెషలిస్టులు సైతం?

గతంలో ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఈ దవాఖాన్లలో పనిచేయాలంటే అనాసక్తి చూపేవారని, ప్రస్తుతం స్పెషలిస్టులను కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు డీసీహెచ్ డాక్టర్ రవిబాబు తెలిపారు.
మారుమూల ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించి నియామకాలు చేపట్టామన్నారు. దీనివల్ల ఒకప్పుడు భద్రాచలం వంటి పెద్ద ఆసుపత్రుల్లో కూడా లేని ప్రసూతి వైద్యులు, ఇప్పుడు జిల్లాలోని అన్ని ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నట్లు వివరించారు. కేవలం ప్రసూతి వైద్యమే కాకుండా పీడియా ట్రిక్స్, ఎనస్తీషియా, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, ఫిజియోథెరపీ వంటి అన్ని విభాగాల వైద్యులు అందుబాటులోకి వచ్చాయన్నారు. తన హయంలో భద్రాచలం, అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లందు, పాల్వంచ, బూర్గుంపహాడ్, చర్ల లోని ఆసుపత్రులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం సంతోషంగా ఉన్నదన్నారు.

గణనీయమైన మార్పు

వైద్య పరికరాలు, వైద్య సేవల విస్తరణలో భద్రాద్రి జిల్లా గణనీయమైన అభివృద్ధిని సాధించింది. గతంలో జిల్లాలో 30 డయాలసిస్ మెషీన్లు ఉండగా, ప్రస్తుతం అవి 53కు పెరిగాయి. దీనివల్ల రోగులకు వెయిటింగ్ లిస్ట్ లేకుండా చికిత్స అందుతోంది. గతంలో 3 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉండగా, ఇప్పుడు మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లందులలో అదనంగా ఏర్పాటు చేసి మొత్తం 6కు పెంచారు. ఇది తలసీమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులకు, గర్భిణీలకు వరంగా మారాయి. గర్భస్థ శిశువు ఎదుగుదల లోపాలను గుర్తించే అత్యాధునిక ‘టిఫ్ఫా స్కాన్’ యంత్రాలు జిల్లాలోని ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఆయా హాస్పిటల్స్‌లో ఎప్పటికప్పుడు సౌకర్యాలు, అవసరాలను డీసీహెచ్ గుర్తించి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. పేషెంట్ కేర్ స్టాఫ్​నుంచి డాక్టర్ల వరకు ప్రత్యేకంగా కమిట్‌మెంట్‌తో పనిచేయడమే సక్సెస్‌కు కారణంగా డీసీహెచ్ తెలిపారు.

రేర్ కేసులకు సైతం..

ఇక ప్రభుత్వ ఆసుపత్రులు కేవలం సాధారణ చికిత్సలకే పరిమితం కాకుండా క్లిష్టమైన ఆపరేషన్‌లను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఖరీదైన మోకాలు మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా జరుగుతున్నాయి. ఇక క్రిటికల్ కండిషన్‌లోని చిన్నారులకూ ఎన్‌ఎన్‌సీయూ సేవలూ అందుతున్నాయి. భద్రాచలం ఆసుపత్రిలో కేవలం 800 గ్రాముల బరువున్న పసిబిడ్డను 2 నెలల పాటు శ్రమించి ఇటీవల అక్కడి వైద్యులు బ్రతికించారు. దీంతో పాటు పురుగుల మందు తాగి విషమ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని, ప్రైవేటులో 25 లక్షలు ఖర్చయ్యే చికిత్సను ఉచితంగా అందించి కాపాడారు. అలాగే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉన్న రోగిని చర్ల ఆసుపత్రిలో బ్రతికించారు. అంతేగాక మొదటి కాన్పు సిజేరియన్ అయిన వారికి కూడా రెండవ కాన్పు నార్మల్ డెలివరీ చేయడం, కవల పిల్లలు ఉన్న గర్భిణీలకు ఎక్సర్ సైజ్ ద్వారా నార్మల్ డెలివరీ చేయడం ఇక్కడ విశేషం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, ఉన్న వనరులతోనే నాణ్యమైన సేవలు అందిస్తూ భద్రాద్రి జిల్లా ఆసుపత్రులు ‘శభాష్’ అనిపించుకుంటున్నాయి. ఈ విజయవంతమైన “భద్రాద్రి మోడల్” పై ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక అధ్యయనం చేస్తోంది, తద్వారా ఈ విధానాన్ని రాష్ట్రంలోని ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అమలు చేసే అవకాశం ఉంది.

Also Read: Bhadradri Kothagudem: రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలు.. వర్షాకాలం వచ్చిందంటే నరకయాతనే!

Just In

01

Kavitha: జాగృతి యాత్రలో కీలక మార్పులు.. సర్పంచ్ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్!

Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్‌ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..

Bhadradri Kothagudem: భద్రాద్రి మోడల్‌పై సర్కార్ స్టడీ? ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలకు దేశ స్థాయి గుర్తింపు!

Marriage Debate: తన మనవరాలి పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జయా బచ్చన్.. ఏం అన్నారంటే?

Bhatti Vikramarka: రెండేళ్లలో ఏం చేశాం? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నాం? కాంగ్రెస్ ప్లాన్ ఇదే : భట్టి విక్రమార్క