Khammam ( image credit: swetcha reportr or twitter)
నార్త్ తెలంగాణ

Khammam: ఖమ్మం జిల్లాలో శ్రీ కోటమైసమ్మ తల్లి అతి పెద్ద జాతర.. ఈ విశిష్టత కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Khammam: ఉమ్మడి ఖమ్మం (Khammam)జిల్లాలో అతి పెద్ద జాతర కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మ తల్లి జాతర(Kotamaisamma Jathara 2025) దసరా వచ్చిందంటే సింగరేణి కాలరీస్‌ పరిసర ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. విజయదశమి రోజున ప్రారంభమయ్యే శ్రీకోటమైసమ్మతల్లి జాతర (Kotamaisamma Jathara 2025)  ఐదు రోజులు పాటు రాత్రి పగలు నిరంతరాయంగా సాగుతుంది.

ఈనెల 12న నుండి ప్రారంభమయ్యే కోటమైసమ్మ తల్లి జాతర అన్ని హంగులతో ముస్తాబైంది. జాతర రాత్రి సమయాల్లో విద్యుత్‌ వెలుగులతో జాతర ద్వైదీపమానంగా వెలుగొందుతుంది. పత్తి, మొక్కజన్న,పెసర, నువ్వులు వంటి పంటలు రైతుల చేతికి వస్తున్న దశలో ఈ జాతర జరుగుతుండటంతో రైతు కుటుంబాలు ఇంటిల్లి పాది జాతరకు వచ్చి అనందంగా గడుపుతారు.

Also Read: Ambedkar Open University: గోరటి వెంకన్న, ప్రేమ్ రావత్‌ కు.. గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసిన గవర్నర్

 వేలాది మంది ఈ జాతరకు తరలివస్తుంటారు

ఖమ్మం (Khammam జిల్లా నుండి కాక భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వేలాది మంది ఈ జాతరకు తరలివస్తుంటారు. ఈ జాతరకు వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించుకోవటంతో పాటు జాతరలో ఏర్పాటు చేసే వినోదాత్మక కార్యక్రమాల్లో పాలుపంచుకోని సందడి చేస్తారు. ఈఏడాది జాతరలో కుటుంబ సమేతంగా వినోదం కోసం పెద్దపెద్ద జాయింట్‌వీల్‌, క్రాస్‌వీల్‌, కొలంబస్‌, బ్రేక్‌డ్యాన్స్‌, డ్రాగెన్‌ ట్రైన్‌, చిన్న పిల్లకు రంగురాట్నం, గండ్రంగా తిరిగే కారు, బైక్‌, ఇంద్రజాల ప్రదర్శన వంటి వినోదాంశాలను ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే వారు వినోదాత్మక కార్యక్రమాల్లో ఉత్సహంగా గడిపేలా ఏర్పాటు చేశారు. ఈ జాతర సంబంధించి ప్రత్యేక కధనాలు ఉన్నాయి.

రక్షణ కోసం కట్టిన కోట …

500 ఏండ్ల క్రితం ఉసిరికాయలపల్లి  ప్రాంతంలో దట్టమైన ఆడవి ఉండి కృరజంతువుల భారిన పడి పశువులు, మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈక్రమంలో తమను రక్షించమని అమ్మవారిని కోరుతూ గుట్టమీద కోటను నిర్మించి దానికి కోటమైసమ్మగా నామకరణం చేశారని ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాస శర్మ ఆలయ విశిష్టతను నవతెలంగాణకు వివరించారు. 1948వ సంత్సరంలో పర్సా క్రిష్ణారావు`దమయంతి దంపతులు అమ్మవారి శిల్పంను తయారుచేయించి అక్కడ ప్రతిష్టించటం జరిగిందని అర్చకులు తెలిపారు. అప్పటి నుండి నేటి వరకు అక్కడ ఉత్సవాలు వీరి కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించటం అనావాయితీగా జరుగుతుందన్నారు.

 Also  Read: Gadwal District: దేవుని భూమిపై రియల్ ఎస్టేట్ కబ్జాదారుల కన్ను.. చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కి వినతి!

జాతర లో వాహన పూజలు ప్రత్యేకత

ప్రారంభంలో చిన్న దేవాలయంగా ఉన్న కోటమైసమ్మ తల్లి ఆలయం నేడు అతి పెద్ద జాతరగా రూపాంతరం చెందటం విశేషం. జాతర సందర్బంగా ఆలయ ప్రాంగణంలో భారీ సంఖ్యలో వాహనాల పూజ చేయించుకోవటం ఇక్కడ ప్రత్యేకత. తమ వాహన పూజ చేయిస్తే ఎలాంటి ప్రమాదాలు వాటిల్లవనే ప్రగాఢ విశ్వాసం ఇక్కడి ప్రజలల్లో నెలకొంది. జాతర సందర్భంగా వందల సంఖ్యలో చిన్న, పెద్ద వాహనాలు పూజ కోసం తీసుకవస్తుంటారు. కోటమైసమ్మ తల్లి జాతరకు ఉసిరికాయలపల్లిలోని దేవాలయం ముస్తాబైంది. ఈజాతర ఈనెల 2వ తేది నుండి 6 వరకు జరుగనుంది.

అతి పెద్ద జాతరైన కోటమైసమ్మ జాతర

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ జాతర వేలాది మందితో నడుస్తుంది. అతి పెద్ద జాతరైన కోటమైసమ్మ జాతరను ప్రభుత్వ శాఖలకు పట్టటం లేదు. జాతర మూడు రోజులు మాత్రం పోలీసు శాఖ బంద్‌ బస్తు, వైద్యశాఖ వైద్యశిబిరాన్ని నిర్వహిస్తుంది. రెవిన్యూ శాఖ, ఆర్‌బి, సింగరేణి సంస్ధలు జాతర పట్ల చిన్నచూపు చూస్తున్నాయి. జిల్లాలో జరిగే ఇతర జాతరలతో పోలిస్తే కోటమైసమ్మ జాతరకు వేలాది జనం వస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభుత్వం కొన్ని జాతర్లకు ప్రత్యేక అధికారిని నియమించి వారి పర్యవేక్షణలో జరుపుతుండగా కోటమైసమ్మ జాతరకు మాత్రం ఏ అధికారిని నియమించకుండా విస్మరిస్తున్నారు. ఈ జాతరకు వందలాది మంది ప్రయివేటు వాహనాల్లో వస్తుంటారు. ఈ జాతర సందర్బంగా ఆర్టీసీ కారేపల్లి మీదిగా బస్‌ సౌకర్యం కల్పిస్తే ఆర్టీసీ ఆదాయంతో పాటు ప్రజలు ఎంతో ఉపయోగకరం కానుంది. బస్‌ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

జాతర ఏర్పాట్లు పూర్తి – చైర్మన్‌, ఈవో

దేవదాయశాఖ ఆధ్వర్యంలో జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ పర్సా పట్టాభి రామారావు, ఇవో కొండకింది వేణుగోపాలచార్యులు తెలిపారు. ఇప్పటికే జాతరలో ఏర్పాటు చేసే దుకాణాలు, ఎగ్జిబిషన్‌, ఇతర వినోద సాధనాలకు వేలం పాట నిర్వహించామన్నారు. భక్తులకు ఇబ్బంది కల్గకుండా త్రాగునీరు సౌకర్యం, మరుగుదొడ్లు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. సత్రాలు కూడా అందుబాటులో ఉంచామన్నారు. వాహన పూజలకు ప్రత్యేకంగా పూజారులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఇతర దేవాలయాల నుండి డిప్యూటేషన్‌పై సిబ్బందిని రప్పించటం చేస్తున్నామన్నారు.

Also Read: Bandi Sanjay: ఆ జిల్లాలో జెడ్పీ పీఠాలను కైవసం చేసుకుంటాం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Just In

01

ibomma Warning: టాలీవుడ్‌కు ఐబొమ్మ బిగ్ వార్నింగ్.. స్టార్ హీరోలపై సంచలన ఆరోపణలు

Kadiyam Srihari: ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్లు.. కడియం శ్రీహరి కీలక వాఖ్యలు

Nagarjuna: కింగ్ నాగార్జునకు బిగ్ రిలీఫ్.. రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Bank Holidays 2025: బిగ్ అలెర్ట్.. అక్టోబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఈ తేదీల్లో అస్సలు వెళ్లొద్దు!

Khammam: ఖమ్మం జిల్లాలో శ్రీ కోటమైసమ్మ తల్లి అతి పెద్ద జాతర.. ఈ విశిష్టత కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!