Online Betting Scam(image CREDIT: SWETHA REPORTER)
నార్త్ తెలంగాణ

Online Betting Scam: ఆన్​ లైన్​ బెట్టింగ్ నిర్వాహకులకే టోకరా.. రూ.30లక్షల రూపాయలమోసం?

Online Betting Scam: ఆన్​ లైన్ బెట్టింగ్ యాప్ ల ఉచ్ఛులో చిక్కుకుని లక్షలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్న విషాదాలు కూడా ఉన్నాయి. అయితే, కరీంనగర్(Karimnagar)​ కు చెందిన ఇద్దరు యువకులు ఆన్​ లైన్​ లో బెట్టింగ్​ వ్యవహారాలు నడుపుతున్న వారికే టోకరా ఇచ్చారు. పకడ్భంధీ పథకం ప్రకారం తమ వాళ్లతోనే బెట్టింగులు పెట్టిస్తూ ఓడిపోయిన వారి ఖాతాల్లో జమయ్యే డబ్బును కొట్టేస్తూ వచ్చారు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే 3‌‌0 లక్షల రూపాయలను కొల్లగొట్టారు.

టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు(DCP Ande Srinivasa Rao) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్(Karimnagar)​ ​ కు చెందిన రాజేశ్, అస్లంలు కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. వేర్వేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ వస్తున్నారు. కాగా, కొన్ని రోజుల క్రితం ఆన్​ లైన్ లో బెట్టింగులు నిర్వహిస్తున్న ఖేలో గేమ్​ వెబ్​ అప్లికేషన్ వీరి కంట పడింది. ఖేల్​ స్టార్​, ఖేలో 24, ఖేలో ఎక్స్​ ఛేంజ్​, ఖేలో స్పోర్ట్స్​, విన్​ మ్యాచ్ తదితర ఆన్​ లైన్​ మొబైల్ యాప్​ ల ద్వారా నిర్వాహకులు బెట్టింగులు స్వీకరిస్తున్నట్టు తెలుసుకున్నారు.

 Also Read: MS Dhoni: అసభ్య పదజాలంతో ధోనీ నన్ను తిట్టాడు.. టీమిండియా మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

బోనస్​ ఆఫర్ చూసి…
ఇక, ఖేలో గేమ్​ అప్లికేషన్​ నిర్వాహకులు బెట్టింగుల్లో డబ్బు ఓడి పోయినవారి ఖాతాల్లో బోనస్​ కింద అయిదు నుంచి పదిహేను వేల రూపాయల వరకు జమ చేస్తున్నట్టు రాజేశ్​, అస్లంలకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఖేలో గేమ్​ అప్లికేషన్ నిర్వాహకులకు టోపీ పెట్టాలని ఇద్దరు కలిసి పథకం రూపొందించారు. దాని ప్రకారం ఉద్యోగాలు వెతుక్కుంటూ పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల నుంచి హైదరాబాద్​ వచ్చిన వినయ్ కుమార్​, సాయివర్ధన్​ గౌడ్​, రాహుల్, జెశ్వంత్​, జోడ వేణు గోపాల్​, కోల రామ్​, వేల్పుల ఆకాశ్​, ప్రణయ్​ లతో కలిసి గ్యాంగ్​ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతీ ఒక్కరితో బ్యాంక్ అకౌంట్లు తెరిపించారు. ఆ తరువాత అందరికీ మొబైల్ ఫోన్లు ఇప్పించారు. ఐడీలు, పాస్​ వర్డులు తయారు చేసి ఇచ్చారు.

వేర్వేరు ఐడీలతో…
ఆ తరువాత గ్యాంగ్ సభ్యులతోనే ఖేలో గేమ్​ అప్లికేషన్​ లో పెద్ద పెద్ద మొత్తాల్లో బెట్టింగులు పెట్టించటం మొదలు పెట్టారు. చిత్తూ బొత్తును పోలి ఉండే ఈ గేమ్​ లో డబ్బు పోగొట్టుకున్న వారి ఖాతాల్లోకి అప్లికేషన్​ నిర్వాహకులు అయిదు నుంచి పదిహేను వేల రూపాయలు క్రెడిట్ చేసేవారు. ఈ క్రమంలో ఓడిపోయిన వారి ఖాతాల్లోకి నిరంతరం డబ్బు జమ అవుతూ వచ్చింది. దానిని రాజేశ్​, అస్లంలు విత్ డ్రా చేసుకుని కమీషన్​ గా కొంత మొత్తాన్ని గ్యాంగ్ సభ్యులకు ఇస్తూ వస్తున్నారు. ఇలా కొన్ని రోజుల్లోనే ఖేలో గేమ్ అప్లికేషన్ నిర్వాహకులకు 30లక్షల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టారు.

పక్కా సమాచారంతో…
కాగా, ఈ గ్యాంగ్​ సాగిస్తున్న దందా గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్​ ఇన్స్​ పెక్టర్ ఎస్​.రాఘవేంద్ర, ఎస్​ఐలు మహ్మద్​ సమీవుజ్​ జమా, మహేశ్, నవీన్​ తోపాటు సంజీవరెడ్డినగర్​ పోలీసులతో కలిసి నిఘా పెట్టారు. సంజీవరెడ్డినగర్​ లోని నాగార్జున స్కూల్​ వద్ద ముఠాలో సభ్యులుగా ఉన్న వినయ్ కుమార్​, సాయివర్ధన్​ గౌడ్​, రాహుల్, జెశ్వంత్​, జోడ వేణు గోపాల్​, కోల రామ్​, వేల్పుల ఆకాశ్​, ప్రణయ్​ లను అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారులు రాజేశ్​, అస్లం కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 18 మొబైల్ ఫోన్లు, 3 బ్యాంక్​ పాస్ బుక్కులు, 13 ఏటీఎం కార్డులు, ఆన్​ లైన్​ లో ఉన్న 29.81లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 Also  Read: Rashid Khan: చరిత్ర తిరగరాసిన అఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ప్రపంచంలో ఏ ఆటగాడికీ సాధ్యంకాలేదు

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం