Kamalapur Election: తెర వెనుక రాజకీయాలైనా ప్రజా తీర్పే ధ్యేయం
Kamalapur Election (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Kamalapur Election: తెర వెనుక రాజకీయాలైనా ప్రజా తీర్పే ధ్యేయం.. కమలాపూర్‌లో ధర్మమే గెలిచిందంటూ..!

Kamalapur Election: కమలాపూర్ మండలంలో తాజా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్(Pabbu Satish) మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో నేపథ్యంలో రాజకీయ పార్టీలు, నాయకుల తెర వెనుక ఎన్ని కుయుక్తులు చేసిన కమలాపూర్ లో ధర్మమే గెలిచిందన్నారు. డబ్బు, మద్యం వంటి అనేక ప్రలోభాలు ఉన్నప్పటికీ ప్రజలు తనకు ఇచ్చిన తీర్పు నిజాయితీ, సేవా భావానికి నిదర్శనమని తెలిపారు. తమ పార్టీకి చెందిన కొంత మంది నేతలే కాంగ్రెస్(Congress) బీఆర్‌ఎస్(BRS) పార్టీలతో కలిసి తెర వెనుక రాజకీయాలు చేసినా.. రాష్ట్రంలో రెండో స్థానంలో అత్యధిక మెజారిటీతో ప్రజలు తనను గెలిపించడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

పార్టీలకు సంబంధం లేకున్నా..

కమలాపూర్ ప్రజలు చైతన్యవంతులని, ఈటల రాజేందర్‌(Etala Rajender)ను పతనం చేయడానికి జరుగుతున్న కుట్రలను గుర్తించి తగిన తీర్పు చెప్పారని చెప్పారు. సేవ చేసే వారికే గెలుపు డబ్బుకు కాదు ఈ ఎన్నికల్లో ప్రజలు మంచితనాన్ని ఎంచుకున్నారు అని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకున్నా తమ పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు కూడా కుట్రలకు పాల్పడటం విచారకరమని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇక్కడ ధర్మమే గెలిచిందని స్పష్టం చేశారు. అభివృద్ధిని పక్కనబెట్టి, బీఆర్‌ఎస్(BRS) నాయకులు ప్రత్యేకించి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(MLA Kaushik Reddy) గెలిచిన సర్పంచులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో కనిపించేందుకు ప్రయత్నించడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే ఏ పని చేయలేదుఅని విమర్శించారు.

Also Read: GHMC: ఈ నెల 16న డీలిమిటేషన్‌పై కౌన్సిల్.. 18న బడ్జెట్‌పై స్టాండింగ్ కమిటీ చర్చ!

ప్రజలు డబ్బు రాజకీయాలకు..

మొత్తానికి కమలాపూర్ ప్రజలు డబ్బు రాజకీయాలకు కాదని, మంచి సేవ చేసే నాయకత్వానికే మద్దతునిచ్చారని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు(Thumma Shobhan Babu), నాయకులు బుర్ర కరుణాకర్, మౌటం సంపత్, పిల్లి సతీష్, పబ్బు సాంబయ్య, మార్కా అశోక్, రామ్ శెట్టి రాజయ్య, ఓస్కుల కీర్తన, తుమ్మ స్వాతి రాజేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Also Read: MGNREGS Renaming: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు!.. కొత్త పేరు ఏంటంటే?

Just In

01

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా

Harish Rao: ఫుట్‌బాల్ మీద ఉన్న శ్రద్ధ.. స్కూల్ విద్యార్థులపైన లేదా.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

Gurram Papireddy: యువర్ హానర్ ‘గుర్రం పాపిరెడ్డి’ ట్రైలర్ వచ్చేసింది.. చూసి నవ్వుకోండి..

Event Organiser Arrest: కోల్‌కత్తాలో గందరగోళం.. మెస్సీకి సారీ చెప్పిన సీఎం.. ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్