Jupally Krishna Rao: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, సరఫరాపై ఐడీఓసీలో మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి,(Krishna Mohan Reddy) పర్ణిక రెడ్డి, మేఘారెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, డా. రాజేష్ రెడ్డి, డా. వంశీకృష్ణ, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. యూరియా విషయంలో కలెక్టర్లు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియా నిల్వలను రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులు, అధిక ధరలకు విక్రయించే ఫెర్టిలైజర్స్ షాప్ డీలర్స్ పై కేసులు నమోదు చేయాలని, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కృత్రిమ కొరత సృష్టించే వారిపై, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రెస్ మీట్ లు పెట్టి రైతులకు భరోసా కల్పించాలని, .స్టాక్ వివరాలు వెల్లడించి, రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలి సూచించారు. ముఖ్యంగా ప్రైవేట్ డీలర్ ల వద్ద ఉన్న స్టాక్ సక్రమంగా సరఫరా అయ్యేలా ఆయా జిల్లా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని అన్నారు. యూరియా వ్యవసాయ సీజన్ ముగిసే వరకు ప్రతి ఎరువుల షాప్,పి. ఏ.సి.ఎస్ , ఆగ్రో సేవా కేంద్రాల వద్ద ఒక్కొక్క షాప్ కు ఒక అధికారిని నియమించాలని, వారికి బాధ్యతలు అప్పగించాలని, యూరియా ఇండెంట్ ఎంత వచ్చింది స్టాక్ లభ్యత ఎంత ఉంది, ఎంత సరఫరా చేశారు? తదితర విషయాలపై పక్కాగా మానిటర్ చేయాలని అన్నారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
పోలీస్ అధికారులు కూడా వ్యవసాయ అధికారులు, ప్రతి షాప్ వారిగా నియమించిన అధికారులతో సమన్వయం చేసుకోవాలని, యూరియా సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. రాబోయే రబీ సీజన్ కు సంబంధించి రైతులకు ఎంత యూరియా అవసరమో అంచనా వేసి, వాస్తవ లెక్కలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపాలని, ఆ ప్రతిపాదనలు బట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇండెంట్ పంపుతుందని వివరించారు.
అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ…
రాష్ట్రాలకు యూరియా కేటాయింపుల కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయని, రాష్ట్రాల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సరఫరా చేయాల్సిన కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదన్నారు. కేంద్రం తెలంగాణకు ఖరీఫ్ సీజనుకు 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని, కానీ ఇప్పటివరకు కేవలం 6.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే సరఫరా చేసిందని, ఇంకా 3 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాల్సి ఉందని, దీంతో రాష్ట్రంలో యూరియా కొరత నెలకొందన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తూ… కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. యూరియా సరఫరా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. రైతుల అవసరాలను తీర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ మాట్లాడుతూ…..
నాగర్ కర్నూలు జిల్లాలో 5,38,462 ఎకరాల్లో పంట సాగు జరుగుతుందని అందుకు అనుగుణంగా 34942 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 21186 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, నేటి వరకు 20297 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేయడం జరిగిందని, ప్రస్తుతం 889 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని, సెప్టెంబర్ 30 నాటికి జిల్లాకు 13755 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంత్రికి వివరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 22 ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు,33 రైతు ఆగ్రో సహాయ కేంద్రాలు, 236 ప్రైవేటు క్రిమిసంహారక విక్రయ దుకాణాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎక్కడా కొడత లేకుండా విక్రయ కేంద్రాల ద్వారా పకడ్బందీగా యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.ప్రతి యూరియా విక్రయ కేంద్రం వద్ద ఒక ప్రభుత్వ అధికారిని నియమించి విక్రయాలను పారదర్శకంగా కొనసాగేలా ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
నాగర్ కర్నూల్ శాసనమండలి సభ్యులు కుచుకుళ్ళ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ..
జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియాను అందించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేయాలన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ విక్రయ కేంద్రాల వద్ద అధిక ధరలు వసూలు చేయకుండా చూడాలని ఆయన సూచించారు. నియోజకవర్గాల వారీగా డీలర్లు, ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు కలెక్టర్లు చేయాలని కోరారు.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ..
నాగర్ కర్నూలు నియోజకవర్గ పరిధిలోని తాడూరు తిమ్మాజీపేట మండలాల్లో గతంలో జడ్చర్ల నుండి రైతులు తెచ్చుకునేవారు అని ప్రస్తుతం అక్కడ యువనందుకు స్థానికంగా కొనుగోలు చేసేందుకు రైతులు అధికంగా విక్రయ కేంద్రాలకు వస్తున్నారని అందుకు సరిపడా యూరియాను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు డీలర్లు అధిక రెట్లు బ్లాక్ మార్కెట్ను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ..
అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ పదర మండలాల్లో యూరియా కొరత ఉందని, రైతుల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు అందుకు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అవసరమైన యూరియాను ఆయా మండలాలకు పూర్తిస్థాయిలో యూరియాను పంపిణీ చేస్తున్నట్లు చేరవేసినట్లు కలెక్టర్ తెలిపారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ..
కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో వెల్దండ మండలంలో యూరియా కొరత అధికంగా ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ నిన్న రాత్రి జిల్లాకు వచ్చిన యూరియా నిలువలనుండి కల్వకుర్తి నియోజకవర్గానికి చేరవేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు