Jogulamba Gadwal: ఖరీఫ్ లో సాగు చేస్తున్న పంటలకు ఎరువులు వేసుకునేందుకు ఆశించిన స్థాయిలో యూరియా(Urea) దొరకకపోవడంతో రెండు నెలలుగా రైతులు(Farmers)పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లాకు ఖరీఫ్ పంటలకు గాను 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని భావించి ఆ మేరకు ఇండెంట్ వచ్చినా సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు పి ఎ.సి.ఎస్, ఆగ్రో సెంటర్ల చుట్టూ తిరుగుతూ యూరియా ఎప్పుడొస్తుందని అధికారులను అడిగే పరిస్థితులు దాపురించాయి.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
ప్రతిరోజు టోకెన్ల కోసం వస్తుండగా స్టాక్ లేదని చెబుతున్నడంతో రైతులు జోగులాంబ గద్వాల(Jogulamba Gadwal) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో రైతులు నిరసన చేపట్టారు. టోకెన్ల కోసం ఏకంగా క్యూలైన్ లో గంటల తరబడి నిలుచుండే బదులు తమ చెప్పులను పెట్టి నిరసన తెలిపారు. జూన్ జూలై నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుకు ఎరువుల అవసరం ఏర్పడలేదు.
జూరాల, నెట్టెంపాడు కింద పెరిగిన సాగు విస్తీర్ణం
జూరాల, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగయ్యే వరి పంటల విస్తీర్ణం ఊపందుకొంది. ఇప్పటికే వరి నాట్లు పెట్టి నెలకు పైగా అవుతున్నా అందుకు ఉపయోగపడే యూరియా నిల్వలలో సరిపడా లేకపోవడంతో రైతులు (Farmers)తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి నాటిన అనంతరం మొదటి దశలో ఎరువు వేయడం ద్వారా మొక్క ఏపుగా పెరుగుతుందని రైతులు(Farmers) భావిస్తారు. ఈ క్రమంలోనే గద్వాల, ధరూర్ మండలాలలో యూరియా కోసం రైతులు(Farmers) ఎదురుచూస్తున్నారు.
Also Read: Jogulamba Gadwal district: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. అన్నదాతలపై దగా చేస్తున్న వ్యాపారులు..?