Gadwal Farmers: పత్తి పంట సాగు చేస్తున్న రైతుకు కష్టాలు తప్పడం లేదు. గత సంవత్సరం పత్తి సాగు చేసిన రైతుకు (Gadwal Farmers) వాతావరణం అనుకూలించి అధిక దిగుబడులు రాగా ప్రస్తుత ఏడాది సైతం ప్రతి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. అధిక వర్షాల కారణంగా పత్తి పంట పూత కాయ పట్టే దశలో ఎరుపు రంగుకు మారి దిగుబడులు వచ్చే టైంలో మొదటి కోతతోనే రైతులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో లక్ష ఇరవై వేల ఎకరాలలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ లో మే నెలలోనే కురిసిన ముందస్తు వర్షాలకు కొందరు రైతులు ముందస్తుగా పత్తి పంటను వేశారు. అనంతరం జూన్ జూలై నెలలో వరుణుడు ముఖం చాటేయడంతో వర్షాలు లేక రైతులు పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అడపదడపా కురిసిన వర్షాలకు రైతు పత్తి విత్తనాలు నాటుకున్నా ఆశించిన స్థాయిలో మొలక శాతం రాకపోవడంతో రెండు దఫాలుగా విత్తనాలు వేసుకోవాల్సి వచ్చింది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తుండగా దిగుబడులపై ఆశలు పెంచుకున్నారు. కానీ తరచుగా కురుస్తున్న ఎడతెరిపిలేని అధిక వర్షాల వల్ల అలంపూర్ తాలూకాలోని మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాలలో నల్లరేగడి పొలాల్లో సాగు చేసిన పత్తి పంటలు ఒకసారిగా అధిక వర్షానికి మొక్కలు ఎర్ర భారీ పట్టిన కాయలు సైతం నల్లగా మారి రైతులకు చివరకు కన్నీరే నిలిచే పరిస్థితి దాపురించింది. ఉన్న పూత సైతం మొక్క ఎరుపు రంగుగా మారడంతో రాలిపోతుంది.
Also Read: OG Movie Ticket Hike: ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపుపై.. తనకు తెలియకుండానే జీవో ఇచ్చారని మంత్రి ఫైర్
ఎర్రబారుతున్న మొక్కలు
ప్రస్తుత ఖరీఫ్ లో సాగు చేసిన పత్తి పంట పొలాలు తెల్ల బంగారానికి బదులు మొక్కలు ఎర్రబారి కళావిహీనంగా మారుతున్నాయి. ఎకరాకు పది క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వస్తుందని రైతులు ఆశించి ఎకరాకు 40 వేలకు పైగా పెట్టుబడి వ్యయం చేశారు.సేద్యం, విత్తనాలు, కలుపులు, ఎరువులు, క్రిమిసంహారక మందులకు ఖర్చు చేయగా మొక్కలు ఏపుగా పెరిగి పూత,కాయ పట్టే దశలో వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా మొక్క ఎరుపు రంగుకు మారడంతో రైతులు పంట సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. కొందరు రైతులు పత్తి పంటను తీసేసి పొగాకు పంటను వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా మిరపకు ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో పాటు తెగుళ్ల బెడద తీవ్రతరం కావడంతో పెట్టుబడుల భారం అధికం కావడంతో ప్రత్యామ్నాయంగా పత్తి పంట సాగు వైపు రైతులు మొగ్గు చూపారు. కొన్ని చోట్ల ఎర్ర రేగటి నెలలో పత్తి పంట కొంతమేర ఆశాజనకంగా ఉన్నా, అధిక విస్తీర్ణంలో నల్ల రేగడి నేలల్లోనే పత్తి పంటను రైతులు సాగు చేశారు. వచ్చిన పంటను సైతం తీసుకునేందుకు కూలీలకు కేజీకి 15 రూపాయలు చొప్పున వెచ్చించి తీయాల్సి వస్తుందని, ఇప్పటికి సిసిఐ కొనుగోలు కేంద్రం ఓపెన్ కాకపోవడంతో గ్రామాలలో దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి రావడంతో పాటు సమీపంలోని రాయచూరు కు తీసుక పోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
పెట్టుబడి పెరిగింది.. దిగుబడి తగ్గింది : రైతు కేశవులు
ఈసారి పత్తి పంటను 6 ఎకరాలలో సాగు చేశాను. ఇప్పటికే ఎకరానికి 40 వేలకు పైగా వ్యయమైంది. పంట మధ్యదశ కొచ్చి కాయ పూత పట్టే దశలో మొక్క ఎరుపు బారి మొక్కకు కాయలు కేవలం 20 ఆపైన మాత్రమే ఉన్నాయి. దీంతో మాకు పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదు.
Also Read: Balakrishna Controversy: బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి- అఖిల భారత చిరంజీవి యువత