Jagityal district: తన ఇంటి బాట సమస్య పరిష్కారం కోరుతూ గత వారం ప్రజావాణి వద్దకు చేరుకుని కార్యాలయం ముందు నేలపై పడుకుని నిరసన తెలిపిన జగిత్యాల జిల్లా(Jagtial District) మల్లాపూర్ మండలం వెంపేట(Vempeta) గ్రామానికి చెందిన రాజ గంగారాం(Raja Rangaram) అనే దివ్యాంగుడు. తన సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం అదే ప్రజావాణిలో తన సమస్య ఫిర్యాదు చేసెందుకు మళ్ళీ వచ్చాడ. తన ఇంటి రోడ్డుపై అక్రమ నిర్మాణం ఆపేయాలని గతవారం అడిగాడు కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.
సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు
ఈసారి నేరుగా కలెక్టర్ ముందే నేలపై పడుకుని నిరసన తెలిపారు. కానీ పరిష్కారం చూపడానికి బదులు, సిబ్బంది, పోలీసులు(Police) ఆయన్ను బయటకు తోశారు. దివ్యాంగుడు అనే సోయి మరిచి ఆయన్ను బయటకు పంపించేందుకు ప్రవర్తించిన తీరు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దివ్యాంగుడిని బయటకు లాగిన పోలీసు, కార్యాలయ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక వికలాంగుడి సమస్య కాదు ఇది అధికారుల వ్యవహారశైలికి అద్దం పట్టే సంఘటన.
Also Read: Maroka Saari First Look: ‘మరొక్కసారి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. లొకేషన్స్ అదిరాయిగా..
బయటకు తోసేసే వేదికా..?
ప్రశ్న సూటిగా ఉంది ప్రజావాణి అంటే ప్రజల సమస్య పరిష్కార వేదికా? లేక సమస్యలనే బయటకు తోసేసే వేదికా..? అని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దివ్యాంగుని సమస్య పరిష్కారానికి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Chiranjeevi: వారి వేతనాల పెంపు విషయంపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్