chiranjeevi(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: వారి వేతనాల పెంపు విషయంపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్

Chiranjeevi: గత కొన్ని రోజులుగా సినీ కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కొంత మంది చిరంజీవిని కలిసి 30 శాతం పెంచేందుకు హామీ పొందారు అనడంపై చిరు స్పందించారు. తాజాగా  ఈ విషయంపై సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో .. ‘ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలిసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. ఈ సమస్య పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. దీనికి నాతో సహా ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్‌ సమిష్టి బాధ్యత. అంతవరకు, అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి.’ అంటూ రాసుకొచ్చారు.

Read also- Crime News: 6 నెలలుగా మైనర్ బాలిక నిర్బంధం.. నమ్మించి చివరికి..!

చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న తాజా చిత్రం  ‘విశ్వంభర’ ఒక పౌరాణిక ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కుతోంది. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. త్రిష, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, రణా దాగ్గుబాటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్యలోకాల నేపథ్యంలో 14 లోకాల కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ స్థాయిలో ప్రత్యేకమైన సెట్లు, విఎఫ్ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ‘బింబిసార’ వంటి ఫాంటసీ పౌరాణిక చిత్రాన్ని తీసిన వశిష్ఠ మరోసారి విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నారు.

Read also- Mass Jathara Teaser: ర‌వితేజ ‘మాస్ జాతర’ టీజర్ వచ్చేది అప్పుడే..

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!