Crime News: 6 నెలలుగా మైనర్ బాలిక నిర్బంధం.. నమ్మించి చివరికి
Crime News (imagecrdit:swetcha)
క్రైమ్

Crime News: 6 నెలలుగా మైనర్ బాలిక నిర్బంధం.. నమ్మించి చివరికి..!

Crime News: పక్కింట్లోనే ఉంటోంది కదా! అని మహిళను నమ్మిన మైనర్ బాలిక నిలువునా మోసపోయింది. భారత్ చూసొద్దామంటే ఆమెతో కలిసి ఇక్కడికి వచ్చి వ్యభిచార కూపంలో చిక్కుకు పోయింది. ముఠా చేతుల్లో బందీగా మారి ఆరు నెలలుగా చిత్రవధ​ అనుభవించింది. అతి కష్టం మీద తప్పించుకున్న బాధితురాలు చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బండ్లగూడ పోలీసు9Bandlaguda Plice)లు గ్యాంగ్ లోని ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చాంద్రాయణగుట్ట సబ్ డివిజన్​ ఏసీపీ సుధాకర్(ACP Sudhakar) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఢాకా వాస్తవ్యురాలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా(Daka) వాస్తవ్యురాలైన మైనర్ బాలిక(Minor girl) స్కూల్లో చదువుకుంటోంది. ఆ చిన్నారి ఇంటి పక్కనే రూపా అనే మహిళ ఉండేది. చీరలపై డిజైనర్​ వర్క్​ చేసే రూపా పక్కింట్లోనే ఉంటున్న బాలికతో పరిచయం పెంచుకుంది. ఇంటికి తరచూ ఆ చిన్నారిని పిలిపించుకుని తీయటి మాటలతో పూర్తిగా ఆకట్టుకుంది.

భారత్ అందమైన దేశం

ఫిబ్రవరిలో ఇలాగే బాలికను ఇంటికి పిలిపించుకున్న రూపా భారత్(India) ఎంతో అందమైన దేశమని అక్కడ చాలా పర్యాటక స్థలాలు ఉన్నాయని చెప్పింది. తనతోపాటు వస్తే అవన్నీ చూసి వద్దామంది. అయితే, భారత్ వెళుతున్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పవద్దని షరతు పెట్టింది. చెబితే ఇంట్లో వాళ్లు నిన్ను పంపించరంటూ చెప్పింది. దీనికి అంగీకరించిన బాలిక ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా రూపా(Rupa)తో కలిసి బయల్దేరింది.

Also Read: Srishti Fertility Center: డాక్టర్ నమ్రత ఖాతాల్లో భారీగా నగదు.. అకౌంట్లను ఫ్రీజ్ చేసిన అధికారులు

పడవ ద్వారా

ఇలా రూపా బాలికను భారత్బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి తీసుకొచ్చింది. అక్కడ ఓ హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్(Human trafficking gang) సహకారంతో అర్దరాత్రి సమయంలో పడవ ద్వారా ఓ నది దాటి చిన్నారితో సహా భారత్ లోకి ప్రవేశించింది. మొదట వెస్ట్ బెంగాల్(West Bengal) లోని కోల్ కతా(Kolakatha)కు చేరుకుని అక్కడి నుంచి రైలు మార్గంలో హైదరాబాద్(Hyderabad) వచ్చింది.

ఆర్కెస్ట్రా డ్యాన్సర్

ఇక్కడికి వచ్చిన తరువాత ఆర్కెస్ట్రా కార్యక్రమాల్లో డ్యాన్సర్(Dancer) గా పని చేస్తూ జీవనం గడుపుతున్న మెహదీపట్నం మురాద్ నగర్ నివాసి షహనాజ్ ఫాతిమా(Shahnaz Fatima) (32)కు బాలికను అప్పగించి డబ్బు తీసుకుని స్వదేశానికి వెళ్లిపోయింది. ఆ తరువాత వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన హఫీజ్ బాబానగర్ నివాసి మహ్మద్ సమీర్(Mahumad Sameer) (23) షహనాజ్ ఫాతిమా ఇంటికి వచ్చాడు. బాలికను ఆటోలో ఎక్కించుకుని బండ్లగూడ నివాసి హాజీరా బేగం(Hazeera Begam) (41) ఇంట్లో దిగబెట్టి వెళ్లిపోయాడు.

ఆ పని కోసమే తీసుకొచ్చాం

ఆ తరువాత హాజీరా బేగం నీతో వ్యభిచార కార్యకలాపాలు జరిపించేందుకే ఇక్కడికి తీసుకొచ్చినట్టుగా బాధితురాలితో చెప్పింది. తాను చెప్పినట్టు వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించింది. అక్రమంగా ఇక్కడికి వచ్చావు కాబట్టి పోలీసు(Police)లకు పట్టించి జైలుపాలు చేస్తానని భయపెట్టింది. దాంతో బాధితురాలు ఆమె చెప్పినట్టు చేయటానికి అంగీకరించింది.

Also Read: Medak ST Hostel: ఎస్టీ హాస్టల్‌లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు

హోటళ్లకు తీసుకెళ్తూ

ఆ తరువాత సమీర్(Sameer) బాలికను తన ఆటోలో వేర్వేరు హోటళ్లకు తీసుకెళుతూ ఆమెతో వ్యభిచారం చేయించటం మొదలు పెట్టాడు. ఇలా తీసుకెళ్లి తీసుకొస్తున్న క్రమంలో హాజీరా బేగం ఇల్లు బండ్లగూడలో ఉన్నట్టుగా బాధితురాలు గుర్తించింది. అదే సమయంలో దారిలో ఉన్న బండ్లగూడ పోలీస్ స్టేషన్(Bandalaguda Police Station)ను చూసి గుర్తు పెట్టుకుంది. ఆ తరువాత చిన్నారిని కొన్ని రోజులు షహనాజ్ ఫాతిమా ఇంట్లో నిర్భంధించి ఆమెను వేర్వేరు హోటళ్లకు పంపిస్తూ వచ్చారు. ఆ తరువాత బాధితురాలిని తిరిగి హాజీరా బేగం ఇంటికి మార్చారు.

తప్పించుకుని

శుక్రవారం ఎప్పటిలానే సమీర్ బాధితురాలిని తన ఆటోలో ఓ హోటల్ వద్దకు తీసుకెళ్లాడు. అతను ఆటో పార్క్ చేయటానికి వెళ్లగానే బాలిక అక్కడి నుంచి తప్పించుకుంది. నేరుగా బండ్లగూడ స్టేషన్ కు చేరుకుని విషయం మొత్తం వివరించింది. ఈ మేరకు సీఐ ఆర్​.దేవేందర్9CI Devender), డీఐ బీ.శ్రీనివాసరావు(DI Srinivasa Rao) కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నిందితుల్లో హాజీరా బేగం, షహనాజ్ ఫాతిమా, సమీర్​ లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సర్వర్​, రూపా(Rupa)ల కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని రెస్క్యూహోంకు తరలించారు. నిందితులను పట్టుకున్న సిబ్బందిని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్(DCP Chaithnya Kumar) అభినందించారు.

Also Read: Putin India Visit: భారత్‌ వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. కీలక పరిణామం

Just In

01

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క

Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు

Ward Member Dies: గెలిచిన రోజే వార్డు సభ్యుడి మృతి.. విషాద ఘటన

Boyapatri Sreenu: ఒక మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడొచ్చు. కానీ దేవుడు అనుకుంటే మాత్రం..