doctor ( Image Source: Twitter )
తెలంగాణ

Srishti Fertility Center: డాక్టర్ నమ్రత ఖాతాల్లో భారీగా నగదు.. అకౌంట్లను ఫ్రీజ్ చేసిన అధికారులు

Srishti Fertility Center: సంచలనం సృష్టించిన యూనివర్సల్​ సృష్టి టెస్ట్​ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతతోపాటు ఆయా హాస్పిటళ్లకు చెందిన బ్యాంక్​ ఖాతాల్లో కోట్లాది రూపాయల నగదు ఉన్నట్టు తాజాగా గుర్తించారు. ఈ క్రమంలో ఆయా అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. రాజస్తాన్ కు చెందిన గోవింద్ సింగ్​ దంపతుల ఫిర్యాదుతో సరోగసి పేర డాక్టర్ నమ్రత.. ఆమె గ్యాంగ్​ సభ్యులు సాగిస్తూ వస్తున్న చైల్డ్​ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఒక్క గోపాలపురం పోలీస్ స్టేషన్​ లోనే ఇప్పటివరకు డాక్టర్ నమ్రత తదితరులపై 8 ఎఫ్​ఐఆర్​ లు నమోదయ్యాయి.

వీటికి సంబంధించి పోలీసులు డాక్టర్​ నమ్రత, డాక్టర్ విద్యులత, డాక్టర్ సదానందంతోపాటు మొత్తం 17మందిని అరెస్ట్ చేశారు. ఇక, విచారణలో డాక్టర్ నమ్రత, ఇతర నిందితులకు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఈ గ్యాంగుల నుంచి లక్ష మొదలుకుని 5లక్షలు ఇచ్చి పిల్లలను కొంటూ వచ్చిన డాక్టర్ నమ్రత సంతానం కోసం తన వద్దకు వచ్చిన వారికి సరోగసి ద్వారా పుట్టారని ఇస్తూ 30 నుంచి 40 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా నిర్ధారించారు. దాంతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాల పేర క్యాంపులు నిర్వహించి గర్భం దాల్చిన నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలను గుర్తించేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎలాగూ పిల్లలను పోషించే స్తోమత ఎలాగూ మీకు లేదు కాబట్టి మాకు ఇచ్చేస్తే డబ్బు ఇస్తామని వారిని ఉచ్ఛులోకి లాగి పిల్లలను కొంటూ వచ్చినట్టుగా తెలిసింది.

ప్రసవం కూడా ఉచితంగా జరిపిస్తామని నిందితులు మహిళలను ఒప్పించే వారని తెలియవచ్చింది. ఇక, ఈ కేసులో అరెస్టుల సంఖ్య యాభై దాటవచ్చని పోలీసులు చెబుతున్నారు. డాక్టర్ నమ్రత వద్ద పని చేస్తున్న వారితోపాటు చైల్డ్ ట్రాఫికింగ్​ లో ఆమెకు సహకరిస్తూ వచ్చిన వారి జాబితా పెద్దగానే ఉందని తెలిపారు. పక్కాగా ఆధారాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. ఇప్పటికే కేసులో పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేసినట్టు చెప్పారు. డాక్టర్ నమ్రత మొబైల్​ ఫోన్లను కూడా సీజ్​ చేశామన్నారు. వీటి ఆధారంగా విచారణను ముందుకు నడిపిస్తున్నట్టు తెలిపారు.

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!