Mass Jathara Teaser: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara). శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. రాఖీ పండుగ సందర్భంగా మూవీ నుంచి అప్‌డేట్‌ను పంచుకున్నారు నిర్మాతలు. ఈ మూవీ టీజర్‌ను ఆగస్టు 11న ఉదయం 11.08 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
Read also- Karnataka Crime: వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నేరం.. శరీర భాగాలను ముక్కలు చేసి..
ఈ సినిమా రవితేజ 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున మాస్ మహారాజ్ అభిమానులకు జాతర చేసుకునే టైం రానే వచ్చింది. ‘మాస్ జాతర’ రూపంలో ఈ సినిమా ఆగస్టు 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవనుంది. దీంతో మాస్ మహారాజ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘ధమాకా’ తర్వాత రవితేజ, శ్రీలీల జోడీ మళ్లీ తెరపై కలిసి నటిస్తున్నారు. ‘ధమాకా’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో, ‘మాస్ జాతర’పై కూడా అభిమానుల అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.సినిమా కథాంశం రవితేజ పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఆయన ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలను చూస్తుంటే.. రవితేజ ఒక రగ్గడ్, పవర్ ఫుల్ లుక్‌లో, చేతిలో రివాల్వర్ సిగరెట్‌తో, ఒక జాతర లేదా కార్నివాల్ నేపథ్యంలో కనిపించారు. ఈ ప్రచార చిత్రాలు సినిమా ఎనర్జిటిక్ ఫెస్టివ్ టోన్‌ను సూచిస్తుంది. సినిమాలో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, ఎనర్జిటిక్ సాంగ్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఓలే ఓలే’ అనే సాంగ్ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంది. ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ఈ సినిమాకు సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో మరింత ఉత్సాహాన్ని జోడించారు. సినిమాటోగ్రఫీ విధు అయ్యన్న చేతిలో, ఎడిటింగ్ నవీన్ నూలి చేతిలో ఉంది. స్క్రీన్‌ప్లే డైలాగ్‌లను భాను భోగవరపు, నందు సవిరిగానా అందిస్తున్నారు. ‘మాస్ జాతర’ సినిమా గణేష్ చతుర్థి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని, థియేటర్లలో రన్ పూర్తయిన తర్వాత అక్కడ స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం.
