SLBC Tunnel Works( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

SLBC Tunnel Works: వేగంగా పనులు పూర్తి చేయాలి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

SLBC Tunnel Works: ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును హై ప్రయారిటీలో తీసుకొని, పనులను పునరుద్ధరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. ఆయన సచివాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మాట్లాడుతూ, ఎల్‌ఎల్‌బీసీ పనులు ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నిధులతో పాటు పాలన పరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్నారు.

 Also Read: Bengaluru Constable: కిలాడీ దొంగ.. ఏకంగా పోలీస్ డ్రెస్ కొట్టేసి.. భార్యకు వీడియో కాల్!

త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి,(Revanth Reddy)  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం అనంతరం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను, సూచనలను అనుసరించి పునరుద్ధరణ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. శ్రీశైలం దిగువ భాగం నుంచి వచ్చే వరద కాలువ మిగిలిన 9 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకానికి ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పూర్తి చేయాలన్నదే

ఫలితంగా ప్రతి సంవత్సరం ఆ నీటిని ఎత్తిపోసేందుకే ఏకంగా రూ.750 కోట్లను కేవలం విద్యుత్ ఛార్జీల కొరకు చెల్లించాల్సి వస్తుందన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు, ఫ్లోరోసిస్ రహిత సాగు నీటిని అందించేందుకు ఉద్దేశించ బడిన ఈ ప్రాజెక్ట్ మరో తొమ్మిది కిలోమీటర్లు సొరంగ మార్గం పూర్తయ్యే సమయంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆధునిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

 Also Read: GHMC officials: జీహెచ్ఎంసీలో ఇంటి దొంగలు.. లెక్కకు మించి వసూళ్లు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్