GHMC officials (imagecredit:twitter)
హైదరాబాద్

GHMC officials: జీహెచ్ఎంసీలో ఇంటి దొంగలు.. లెక్కకు మించి వసూళ్లు

GHMC officials: గ్రేటర్ హైదరాబాద్ లోని సుమారు కోటిన్నర మంది జనాభాకు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ(GHMC)లో ఇంటి దొంగల ఇష్టారాజ్యం కొనసాగుతుంది. అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేసేందుకు సిద్దమయ్యారు పలువురు జీహెచ్ఎంసీలోని అక్రమార్కులు. ముఖ్యంగా సుమారు ఏడేళ్ల నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీని ఆర్థికంగా కొంత మేరకైనా గట్టెక్కించేందుకు అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్(Property Tax Collection) కు సంబంధించి టార్గెట్లు విధించటం కార్పొరేషన్ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీలోని 30 సర్కిళ్లలోని సుమారు 19.50 లక్షల ఆస్తుల నుంచి ప్రతి ఏటా సుమారు రూ.2 వేల కోట్ల పై చిలుకు ట్యాక్స్ కలెక్షన్(Tax collection) చేసుకునేవారు.

మొత్తం ట్యాక్స్(Tax) చెల్లిస్తున్న మొత్తం 19.50 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్(Tax Index) నెంబర్లకు చెందిన సుమారు 300 డాకెట్లున్నాయి. వీటిలో ఎక్కువ ఆస్తులు గోషామహాల్ సర్కిల్ లోనే ఉన్నట్లు సమాచారం. ట్యాక్స్ కలెక్షన్ చేసేందుకు జీహెచ్ఎంసీలో 300 మంది బిల్ కలెక్టర్లు, మరో 145 మంది ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లున్నారు. వీరిలో సగానికి పైగా ట్యాక్స్ సిబ్బంది అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేసేందుకు సిద్దమయ్యారు. జీహెచ్ఎంసీలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని సాకుగా చేసుకునే జీహెచ్ఎంసీ మున్సిపల్ యాక్టు లోని సెక్షన్ 213 ను సిబ్బంది వత్తిడి మేరకు అధికారులు అమల్లోకి తెచ్చారు.

సెక్షన్ 213 అంటే?

1959 మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 213 అంటే ఏమిటీ? అంటూ ట్యాక్స్(TAX) యేతర విభాగాలతో పాటు సాధారణ ప్రజానీకానికి కూడా సందేహాం రాక తప్పదు. ప్రస్తుతమున్న ట్యాక్స్ కలెక్షన్ విధానంలో ఆస్తులను అసెస్ మెంట్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావటం, వార్షిక పన్ను విధించి ఏటా కలెక్షన్ చేసే సిస్టమ్ అమల్లో ఉంది. ఈ పాత విధానం ప్రకారం ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన భవన యజమాని ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారా? లేదా? అని ప్రశ్నించటం వరకే ట్యాక్స్ స్టాఫ్(Tax Staff) కు అధికారముంది. కానీ 213 సెక్షన్ ను అమల్లోకి వచ్చిన తర్వాత సెక్షన్ ను అడ్డం పెట్టుకుని చేస్తే ట్యాక్స్ సిబ్బంది ఆయా ఆస్తుల యజమానుల వద్దకు నేరుగా వెళ్లి, భవన నిర్మాణ అనుమతి ప్రతి, నిర్మాణంలో డీవీయేషన్స్(Deviations), అక్యుపెన్సీ సర్టిఫికెట్(Occupancy Certificate) తో పాటు యూసేజీకి సంబంధించిన అన్ని పత్రాలను తనిఖీ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

ఒక వేళ రెసిడెన్షియల్(Residential) నిర్మించి కమర్షియల్(Commercial) గా వినియోగిస్తున్నట్లయితే, అలాంటి ప్రాపర్టీలకు నూరు శాతం ట్యాక్స్ ను పెంచే అధికారం స్టాఫ్ కు వస్తుంది. ఈ సెక్షన్ 213 అమలుతో మహానగరంలోని ప్రతి భవనాన్ని సంబంధిత పత్రాలతో తనిఖీ చేసే పవర్ స్టాఫ్ కు సమకూరటంతో ప్రతి సర్కిల్ లో డిప్యూటీ కమిషనర్, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్(Tax Inspecter), బిల్ కలెక్టర్లు(Bill Collecter) ఓ గ్రూపుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. షాపింగ్ మాల్స్ లలో పదుల సంఖ్యలో వ్యాపార సముదాయాలున్నా, భవన యజమానులు, వ్యాపారులతో ట్యాక్స్ సిబ్బంది బేరం కుదుర్చుకుని వాటికి రెసిడెన్షియల్ ట్యాక్స్(Residential Tax) ను, అది కూడా నామమాత్రంగా వసూలు చేస్తూ జీహెచ్ఎంసీ(GHMC)కి రావాల్సిన ట్యాక్స్ నిధులను జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

Also Read: Gadwal district: గద్వాల జిల్లా కలెక్టర్‌కు అరుదైన గౌరవం.. సన్మానించిన ఉద్యోగులు

దుర్వినియోగమే ఎక్కువ

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ(GHMC)ని గట్టెక్కించే మాట అలా ఉంచితే, ఈ సెక్షన్ 213 సద్వినియోగం కన్నా దుర్వినియోగం ఎక్కువవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే ట్యాక్స్ సిబ్బందిలో మెజార్టీ ఉద్యోగులు జీహెచ్ఎంసీ ఖజానాకు రావల్సిన ప్రాపర్టీ ట్యాక్స్(Property Tax) ను జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అసెస్ మెంట్ లో ఏరియా తక్కువగా చూపించటం, కమర్షియల్ యూసేజీని రికార్డుల్లోకి రెసిడెన్షియల్ యూసేజీగా ఎక్కిస్తూ శాశ్వత కాలం యజమానులకు లబ్దిని చేకూర్చి పెద్ద మొత్తంలో అక్రమార్జనకు పాల్పడ సిబ్బంది కూడా ఉంది.

ఇప్పటికే నగరంలో భూమి ధర ఆకాశాన్నంటిని మణికొండ(Manikonda), గచ్చిబౌలీ(Gachibowli) వంటి ప్రాంతాల్లో డజనుకు పైగా విల్లాలు, ఇండ్లు, అపార్ట్ మెంట్ల నిర్మించుకుని విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, మరోసారి సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని సెక్షన్ 213ని ప్రయోగించి ఆస్తుల యజమానులను భారీగా దోచుకునేందుకు స్టాఫ్ లోని కొందరు అక్రమార్కులు స్కెచ్ వేసి, మరీ గుట్టు చప్పుడు కాకుండా జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. జీహెచ్ఎంసీలోని బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లలో మెజార్టీ శాతం ఉద్యోగులు విలాసవంతమైన భవనాల్లో నివసిస్తున్నట్లు, మరి కొందరైతే నగర శివార్లలో విల్లాలు కొనుగోలు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఆస్తులు కొనుగోలు చేస్తే ఎక్కడ దొరికి పోతామోనన్న భయంతో కొందరు ట్యాక్స్(Tax) సిబ్బంది వడ్డీ వ్యాపారులుగా అవతారమెత్తి, ఎక్కువ మిత్తీలు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు సైతం లేకపోలేవు.

సిబ్బంది దోపిడీ ఇలా

జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఆస్తి ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. కమర్షియల్ ఆస్తులు కమర్షియల్ పన్ను చెల్లించటంతో పాటు అందులోని ప్రతి వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్స్(Trade License) తీసుకోవాలన్న నిబంధన ఉంది. కానీ కొత్త పేటలోని ఓ షాపింగ్ మాల్ లో సుమారు 450 వరకు షాపులున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ వర్తింపునకు జీహెచ్ఎంసీ(GHMC) అమలు చేస్తున్న బెంచ్ మార్క్ విధానంతో క్యాలికులేషన్ చేస్తే, ఈ షాపింగ్ మాల్స్ నుంచి ఏటా బల్దియాకు సుమారు రూ. 13 కోట్ల 64 లక్షల పై చిలుకు ట్యాక్స్ వసూలు కావల్సి ఉండగా, కేవలం రూ. 2 కోట్ల 91 లక్షల వరకు మాత్రమే వసూలు చేస్తున్నట్లు సమాచారం. యజమానులకు ప్రతి సంవత్సరం పన్ను భారాన్ని తగ్గించేందుకు ట్యాక్స్ స్టాఫ్ భారీగా బేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ రకంగా మొత్తం 30 సర్కిళ్ల పరిధిలోని ఎన్నో షాపింగ్ మాల్స్ నుంచి రావాల్సిన ట్యాక్స్ ఖజానాకు చేరకపోవటంతో ఏటా బల్దియా రూ. వంద కోట్లలో నష్టపోతున్నట్లు ఆరోపణలున్నాయి.

Also Read: Online Betting: అన్​ లైన్ బెట్టింగ్‌తో అప్పులపాలు.. పోతున్న ప్రాణాలు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!