Gadwal district: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ (BM Santhosh) అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ(Lakshminarayana), నర్సింగరావు(Narsingarao)లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నీతి ఆయోగ్(NITI Aayog) ద్వారా చేపట్టిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆరు కీలక సూచికలలో విశేష కృషి చేసిన జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్‌ను గవర్నర్ విష్ణు దేవ్ వర్మ(Vishnu Dev Varma) ద్వారా రాజ్ భవన్‌లో అవార్డు పొందిన సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్‌ను ఘనంగా సన్మానించారు.
హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి
గద్వాలలోని భీంనగర్ బీసి(BC) బాలికల వసతి గృహం(BC Girls Hostel) నందు తమకు పురుగుల అన్నం పెడుతున్నారని హస్టల్ ముందు విద్యార్థినీలు బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా నేడు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి సందర్భంగా హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంతోష్(Santhosh) కు విద్యార్థినీలు వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని, తమతో హాస్టల్ వార్డెన్(Warden) పనులు చేయిస్తుందని, విద్యార్థునీలకు అనుగుణంగా కనీస అవసరాలైన బాత్రూంలు, స్వచ్ఛమైన తాగునీరు(Drinking Water) లేవని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విద్యార్థినీలు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ప్రహరీ గోడ(Wall) సైతం లేక ఇబ్బంది పడుతున్నామని, మౌలిక వసతులు కల్పించాలని హాస్టల్ వార్డెన్ కు పలుమార్లు విన్నవించినా తిరిగి మాపైనే దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుందని, ఆమెను సస్పెండ్ చేయాలని విద్యార్థునీలు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ విద్యార్థినీల సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హాస్టల్ తనిఖీ చేస్తానని విద్యార్థులకు హామీనిచ్చారు.
Also Read: Gadwal District: గురుకుల విద్యార్థుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు
సీనియర్ సిటిజన్ ఫోరమ్ కీలక వినతులు
జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహించిన “ప్రజావాణి” కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు(Mohan Rao) పలు ప్రజా ప్రయోజన అంశాలను అధికారుల కలెక్టర్ సంతోష్ దృష్టికి తీసుకువెళ్లారు. గద్వాల(Gadwala) సంస్థానంలో రాజుల కాలం నాటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పురాతన బావి(Ancient well)ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. దీనిపై ఉన్న న్యాయపరమైన అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. స్మృతి వనం లోపల సందర్శకుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే, నిర్మాణంలో ఉన్న ఐటిఐ కళాశాల(ITI College) పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిపించి టెండర్లు కాల్ ఫర్ చేయాలని ఆదేశాలు మౌకిక జారీ చేశారు.
ఆసుపత్రి ప్రాంగణంలో డైనింగ్ హాల్
ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ‘2D ఎకో మిషన్ సిటీ స్కాన్'(2D Eco Mission City Scan) వంటి ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాలన్నారు. రోగులు, వారి బంధువుల కోసం ఆసుపత్రి ప్రాంగణంలో డైనింగ్ హాల్(Dining Hall) నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. గద్వాల తాలూకాను ఆధారంగా చేసుకుని కొత్త మండలాల(Zones)ను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యంగా జనాభా(Population) పరంగా బిజ్వారం గ్రామం(Bijwaram village) అర్హత కలిగినందున దాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
పట్టణాభివృద్ధిలో అక్రమ నిర్మాణాలు
గద్వాల పట్టణంలో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమ నిర్మాణాల(Illegal structures)ను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వీటి కారణంగా పెద్ద అగ్రహారం వెళ్లే ప్రధాన రహదారి ఇరుకుగా మారిందని తెలిపారు. దీంతో తక్షణం వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను జిల్లా కలెక్టర్ మౌఖికంగా ఆదేశించారు. నడిగడ్డ(Nadigadda) ప్రాంత అభివృద్ధి కోసం నీతి అయోగ్(NITI Aayog)కు ప్రత్యేక ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అన్ని అంశాలపై సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
