rajani-kanth( image source:X)
ఎంటర్‌టైన్మెంట్

Rajinikanth: ఆ రోజు కన్నీళ్లు ఆగలేదు.. రజనీకాంత్

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రతో నటించిన కూలీ సినిమా నుంచి ట్రైలర్ రిలీజై సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చెనైలోని అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రజినీకాంత్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను కూలీగా లగేజ్‌ మోయాల్సి వచ్చిందని అన్నారు.‘‘ఒకరోజు నేను రోడ్డుపై నిలబడి ఉంటే, ఒకరు నన్ను పిలిచి, ‘నా లగేజ్‌ను టెంపో వరకూ తీసుకెళ్తావా’ అని అడిగాడు. నేను సరేనన్నాను. అతన్ని నాగా పరిశీలించి చూస్తే, తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. తర్వాత గర్తొచ్చింది. తను నేనూ కలిసి చదువుకున్నామని. అప్పట్లో అతడిని నేను సరదాగా ఆటపట్టించేవాడిని. లగేజ్‌ టెంపో దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత రూ.2 చేతిలో పెట్టి ఒక మాట అన్నాడు. ‘అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు. నీకు ఆ రోజులు గుర్తున్నాయా?’ అని అడిగాడు. ఒక్క సారిగా నాకు కన్నీళ్లు ఆగలేదు. నా జీవితంలో ఎంతో బాధపడిన సందర్భమది’’ అని రజనీకాంత్‌ గుర్తు చేసుకున్నారు.

Read also- Kingdom Collection: ‘కింగ్డమ్’ వసూళ్లు ఎంతంటే..

అనంతరం ‘కూలీ’ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ను రియల్‌ హీరో అంటూ అభినందించారు. ‘‘కూలీ’ సినిమాకు సంబంధించి రియల్‌ హీరో లోకేశ్‌ కనగరాజ్‌. ఈ మూవీపై అంచనాలను పతాకస్థాయికి తీసుకెళ్లారు. విజయవంతమైన కమర్షియల్‌ దర్శకుడితో పనిచేయడం ఆనందంగా ఉంది. ఇందులో నటీనటులతో ఒక తుపాను సృష్టించాడు. అని అన్నారు. లోకేశ్‌ ‘కూలీ’ కథ చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు ‘నేను కమల్‌ ఫ్యాన్‌ సర్‌’ అన్నాడు. ‘నేను నిన్ను అడిగానా’ అని అన్నాను. ‘లేదు సర్‌. మామూలుగా చెప్పాను’ అన్నాడు. ‘ఈ స్టోరీలో పంచ్‌ డైలాగ్‌లు ఉండవు’ అని ముందే చెప్పాడు. అప్పుడే అర్థమైంది ఇదొక ఇంటెన్సిటీ డ్రామా’’ అని రజనీకాంత్‌ చెప్పుకొచ్చారు.

Read also- Saina Nehwal: విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా.. సైనా నెహ్వాల్ సంచలన పోస్టు!

ఆమిర్‌ఖాన్‌ మాట్లాడుతూ.. ‘లోకేశ్‌ నన్ను కలిసినప్పుడు ఈ కథ, రిలీజ్‌ డేట్‌ గురించి ఆయన్ను అడగలేదు. ఎందుకంటే ఇది రజనీసర్ ఫిల్మ్‌. అంతకుమించిన అంశం ఇంకేముంటుంది. నేను లోకేశ్‌ను అడిగింది ఒక్కటే.. ‘షూటింగ్‌ ఎప్పుడు మొదలు పెడుతున్నాం’’ అని చెప్పుకొచ్చారు. ట్రైలర్ లో చూసిన విధంగా చూసుకుంటే నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తు్న్నారని తెలుస్తోంది. ఆయనపై చిత్రించిన యాక్షన్ సీన్స్ కూడా ఆయన అభిమానులను మెప్పించేవిగా ఉన్నాయి. ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, శ్రుతిహాసన్‌, సత్యరాజ్, సౌబిన్‌ షాహిర్, మహేంద్రన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రం సినిమాపై మరింత అంచనాలను పెంచింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు